Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Wednesday

05324,కొండలో గోవిల,koMDalO gOvila (No Audio-Only Translation)

కొండలో గోవిల గుయ్య గుండె పగిలె నీ-
యండకు రాగా బ్రాణమంతలో బ్రదికెరా

వలచి నిన్ను వెదకి వడి నే రాగాను
పులి వలె మగడుండె బోనియ్యక
తలచి నాకంతలోనే తల నొవ్వగాను
చిలుకు బులకలెత్తి సిగ్గుమాలె వలపు

ఏమరించి యింటి వారి నెడసి నే రాగాను
గామైన బిడ్డ యేడ్చె గదలనీక
తామసించి యుండలేక తల్లడించగాను
చీమలు మైవాకినట్టు చిమ్మి రేగె వలపు

వుండ లేక యిప్పుదు నీ వొద్దికి నే రాగాను
కొండవలె మరదుండె గోపగించుక
బొండు మల్లె పరపు పై బొరలేటి ఇట్టి నన్ను
కొండలరాయడ నిన్ను గూడించె నా వలపు

koMDalO gOvila guyya guMDe pagile nee-
yaMDaku rAgA brANamaMtalO bradikerA

valachi ninnu vedaki vaDi nE rAgAnu
puli vale magaDuMDe bOniyyaka
talaci nAkaMtalOnE tala novvagAnu
ciluku bulakaletti siggumAle valapu

EmariMci yiMTi vAri neDasi nE rAgAnu
gAmaina biDDa yEDche gadalaneeka
tAmasiMci yuMDalEka tallaDiMcagAnu
ceemalu maivAkinaTTu cimmi rEge valapu


vuMDa lEka yippudu nee voddiki nE rAgAnu
koMDavale maraduMDe gOpagiMcuka
boMDu malle parapu pai boralETi iTTi nannu
koMDalarAyaDa ninnu gUDiMce nA valapu 12/8/08 delete kasturi


Anna Sings


The pull of love,


bhakti : that 's all demanding


all-giving passion for the beloved,


in the voice of a love maid tribal girl.


Trans by william Jackson:Songs of Three Saints


When I heard the call
Of the cuckoo on the hill
My heart was torqued,
And,squeezed,it broke


But when I arrived
At your threshold
My soul was healed


when I was leaving my house
(It makes my head spin
To think about it now)
My mate,tiger fierce.
Blocked the door,snarling


-My hairs erect with love
Who cared what anyone said?
I had heard the call
Of the cuckoo on the hill.




bhakti : that 's all demanding


వలచి నిన్ను వెదకి వడి నే రాగాను
ఏమరించి యింటి వారి నెడసి నే రాగాను
వుండ లేక యిప్పుదు నీ వొద్దికి నే రాగాను

The Pull of love.


పులి వలె మగడుండె బోనియ్యక
గామైన బిడ్డ యేడ్చె గదలనీక
కొండవలె మరదుండె గోపగించుక

All giving Passion for the beloved.


చిలుకు బులకలెత్తి సిగ్గుమాలె వలపు
చీమలు మైవాకినట్టు చిమ్మి రేగె వలపు
కొండలరాయడ నిన్ను గూడించె నా వలపు




Sringara Ofcourse at its Best


తలచి నాకంతలోనే తల నొవ్వగాను
తామసించి యుండలేక తల్లడించగాను
బొండు మల్లె పరపు పై బొరలేటి ఇట్టి నన్ను

06088,palukula dEniya lolikeDicakkani

పలుకుల దేనియ లొలికెడిచక్కని
వెలదులు కోనేటివిభుని బాడెదరె

నలికపు జూపుల నగవుల నునుసిగ్గు
దొలకంగ నిగ్గు దోపంగ
కలికికికన్నుగవ కాంతుల ప్రేమ
నెలయించి తిరువేంకటేశుని బాడెదరె

పెదవుల సన్నపు బీటలమెఱుగులు
పొదలంగ ముద్దులు పొలయంగా
వదనము సొబగులు వనితలు కడు
గదసి వెంకటగిరిఘనుని బాడెదరె

భారపు గుచముల పన్నీటి చెమటలు
జారంగా తావిచల్లంగా
కూరిమిరచనలు గొసరుచుగడు
ధీరుని గోనేటితిమ్మని బాడెదరె



Get this widget | Track details | eSnips Social DNA


palukula dEniya lolikeDicakkani
veladulu kOnETiviBuni bADedare

nalikapu jUpula nagavula nunusiggu
dolakaMga niggu dOpaMga
kalikikikannugava kAMtula prEma
nelayiMci tiruvEMkaTESuni bADedare

pedavula sannapu bITalamerxugulu
podalaMga muddulu polayaMgA
vadanamu sobagulu vanitalu kaDu
gadasi veMkaTagirighanuni bADedare

BArapu gucamula pannITi cemaTalu
jAraMgA tAvicallaMgA
kUrimiracanalu gosarucugaDu
dhIruni gOnETitimmani bADedare

01130,paramAtmuni nOra bADuchunu iru

పరమాత్ముని నోర బాడుచును ఇరు
దరుల గూడగదోసి దన్చీ మాయ ||

కొలది బ్రహ్మాన్డపు కున్దెన లోన
కులికి జీవులను కొలుచు నిన్చి
కలికి దుర్మోహపు రోకలి వేసి
తలచి తనువులను దన్చీ మాయ ||

తొన్గలి రెప్పల రాత్రులు బగలును
సన్గ్డి కన్నులుగా సరి దిప్పుచు
చెన్గలిన్చి దిక్కులనే చేతులూచి
దన్గుడు బియ్యాలుగా దన్చీ మాయ ||

అనయము తిరు వేన్క్టాధీస్వరుని
పనుపడి తనలో బాడుచును
వొసరి విన్నాణి జీవులనెడి బియ్యము
తనర నాతని కియ్య దన్చీ మాయ ||


Get this widget | Track details | eSnips Social DNA

In this allegorical Padam Annamaiah compares freeing of husk from paddy to dispelling illusion of living beings.

paramAtmuni nOra bADuchunu iru
darula gooDagadOsi danchee mAya ||

Maya(delusion)is singing the praise of the Supreme Lord while pounding paddy and pushing grains(living beings) to the center.

koladi brahmAnDapu kundena lOna
kuliki jeevulanu koluchu ninchi
kaliki durmOhapu rOkali vEsi
talachi tanuvulanu danchee mAya ||

Maya is pounding paddy(living beings) in motar(cosmos) with a wooden pestle.

tongali reppala rAtrulu bagalunu
sangDi kannulugA sari dippuchu
chengalinchi dikkulanE chEtuloochi
danguDu biyyAlugA danchee mAya ||

She is swinging her arms and watching the process with her eyes(day and night). She is removing husk to make rice(freeing the living beings of delusion).


anayamu tiru vEnkTAdheeswaruni
panupaDi tanalO bADuchunu
vosari vinnANi jeevulaneDi biyyamu
tanara nAtani kiyya danchee mAya ||

She is singing the praise of Sri Venkateswara and offering the rice(enlightened souls)to the Supreme Lord.

06152,iMti cEsinapUja liTluMDe danahRudaya

ఇంతి చేసినపూజ లిట్లుండె దనహృదయ
మంతయును బూజించె నడియాసచేత

చనుదోయి పూజించె జాజుబులకలచేత
కనుదోయి పూజించె గన్నీటిచేత
మనసు పూజించె బ్రేమపుగోరికలచేత
తనువు పూజించె బరితాపంబుచేత

తలపు పూజించె చింతాపరంపరచేత
అలపు పూజించె నొయ్యనిపలుకులచేత
వలపు పూజించె బొలయలుకచేతను నెంతే
సొలపు పూజించె దనచూపరలచేత

అనఘు డీ తిరువేంకటాద్రీశు కృపచేత
వనిత సంభోగపరవశము బూజించె
తనివోని గుఱుతుచే తనవిలాసములచే
గనుపట్టు బూజించె గళమర్మములను

Get this widget | Track details | eSnips Social DNA




iMti cEsinapUja liTluMDe danahRudaya
maMtayunu bUjiMce naDiyAsacEta

canudOyi pUjiMce jAjubulakalacEta
kanudOyi pUjiMce gannITicEta
manasu pUjiMce brEmapugOrikalacEta
tanuvu pUjiMce baritApaMbucEta

talapu pUjiMce ciMtAparaMparacEta
alapu pUjiMce noyyanipalukulacEta
valapu pUjiMce bolayalukacEtanu neMtE
solapu pUjiMce danacUparalacEta

anaghu DI tiruvEMkaTAdrISu kRupacEta
vanita saMBOgaparavaSamu bUjiMce
tanivOni gurxutucE tanavilAsamulacE
ganupaTTu bUjiMce gaLamarmamulanu

01099,ENanayanalacUpu leMta sobagaiyuMDu

ఏణనయనలచూపు లెంత సొబగైయుండు
ప్రాణసంకటములగు పనులు నట్లుండు

ఎడలేనిపరితాప మేరీతి దా నుండు
అడియాసకోరికెలు నటువలెనె యుండు
కడలేనిదు:ఖసంగతి యెట్ల దా నుండు
అడరుసంసారంబు నట్లనే వుండు

చింతాపరంపరల జిత్త మది యెట్లుండు
వంతదొలగని మోహవశము నట్లుండు
మంతనపు బనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గములగతి యట్లనుండు

దేవుడొక్కడె యనెడితెలివి దనకెట్లుండు
శ్రీ వేంకటేశుకృపచేత లట్లుండు
భావగోచరమైన పరిణ తది యెట్లుండు
కైవల్యసౌఖ్యసంగతులు నట్లుండు


Get this widget | Track details | eSnips Social DNA


ENanayanalacUpu leMta sobagaiyuMDu
prANasaMkaTamulagu panulu naTluMDu

eDalEniparitApa mErIti dA nuMDu
aDiyAsakOrikelu naTuvalene yuMDu
kaDalEnidu:KasaMgati yeTla dA nuMDu
aDarusaMsAraMbu naTlanE vuMDu

ciMtAparaMparala jitta madi yeTluMDu
vaMtadolagani mOhavaSamu naTluMDu
maMtanapu banulapayi manasu mari yeTluMDu
kaMtuSaramArgamulagati yaTlanuMDu

dEvuDokkaDe yaneDitelivi danakeTluMDu
SrI vEMkaTESukRupacEta laTluMDu
BAvagOcaramaina pariNa tadi yeTluMDu
kaivalyasauKyasaMgatulu naTluMDu

03384, nA kEla vicAramu nA kEla yAcAramu

నా కేల విచారము నా కేల యాచారము
సాకిరైనవాడ నింతే సర్వేశుడే దిక్కు

ప్రపంచమధీనము పాలుపడ్డ దేహమిది
ప్రపంచముతోడిపాటు పరగీని
యెపుడూ నీయాతుమ యీశ్వరాధీనము
అపుడాత డెట్టునిచె నట్టే అయ్యీని

కర్మాన కధీనము కలిములు లేములు
కర్మమెట్టు గల్పించె గలిగీని
అర్మిలి నాయాచార్యునధీనము మోక్షము
ధర్మ మతనికృపను తానే వచ్చీని

చిత్తమునకధీనము చిల్లరయింద్రియములు
చిత్తము చిక్కినప్పుడు చిక్కీనవి
హత్తి శ్రీ వేంకటేశుదాస్యమధీనము జన్మము
పొత్తుల నందుకు నది పూచినట్టయ్యీని

Get this widget | Track details | eSnips Social DNA




nA kEla vicAramu nA kEla yAcAramu
sAkirainavADa niMtE sarvESuDE dikku

prapaMcamadhInamu pAlupaDDa dEhamidi
prapaMcamutODipATu paragIni
yepuDU nIyAtuma yISvarAdhInamu
apuDAta DeTTunice naTTE ayyIni

karmAna kadhInamu kalimulu lEmulu
karmameTTu galpiMce galigIni
armili nAyAcAryunadhInamu mOkShamu
dharma matanikRupanu tAnE vaccIni

cittamunakadhInamu cillarayiMdriyamulu
cittamu cikkinappuDu cikkInavi
hatti SrI vEMkaTESudAsyamadhInamu janmamu
pottula naMduku nadi pUcinaTTayyIni

02263,nI cittamu nA BAgyamu nE neMtaTi vADanu

నీ చిత్తము నా భాగ్యము నే నెంతటి వాడను
యేచి నీవు రక్షించేదే యెక్కుడుపుణ్య మింతే

పాటించి నీ భావము పట్టవశమా తలచి
మేటి నా మనసు నీకు మీదెత్తుటింతే
నూటికైన నీ నామము నుడుగగవశమా
మాటలు నీ నెలవుగా నుట్టుపెట్టు టింతే

వేవేలైన నీ కధలు వినగ నా తరమా
సోవగా వీనులు తావు చూపుట యింతే
దేవ నీసాకారము ద్రిష్టించనావశమా
పావనముగా నందులో బనిగొను టింతే

గట్టిగా నిన్ను బూజించ గమ్మటి నా వసమా
నెట్టన నా మేను నీకు నేమించు టింతే
పట్టపలమేల్మంగపతివి శ్రీ వేంకటేశ
జట్టిగొనుకొరకు నీ శరణను టింతే


Get this widget | Track details | eSnips Social DNA


nI cittamu nA BAgyamu nE neMtaTi vADanu
yEci nIvu rakShiMcEdE yekkuDupuNya miMtE

pATiMci nI BAvamu paTTavaSamA talaci
mETi nA manasu nIku mIdettuTiMtE
nUTikaina nI nAmamu nuDugagavaSamA
mATalu nI nelavugA nuTTupeTTu TiMtE

vEvElaina nI kadhalu vinaga nA taramA
sOvagA vInulu tAvu cUpuTa yiMtE
dEva nIsAkAramu driShTiMcanAvaSamA
pAvanamugA naMdulO banigonu TiMtE

gaTTigA ninnu bUjiMca gammaTi nA vasamA
neTTana nA mEnu nIku nEmiMcu TiMtE
paTTapalamElmaMgapativi SrI vEMkaTESa
jaTTigonukoraku nI SaraNanu TiMtE

01317, telisina teliyuDu teliyani vAralu

ప|| తెలిసిన తెలియుడు తెలియని వారలు | తొలగుడు బ్రహ్మాదులె యెరుగుదురు ||

చ|| వరదు డఖిలదేవతలకు వంద్యుడు | గరుడు డసురులకు కంటకుడు |
పరమాత్ముడంబుజ భవ శివాదులకు | పరుల కెల్ల మువ్వురిలో నొకడు ||

చ|| దేవుడు సనకాది మునులకును పర- | దైవమఖిల వేదములకును |
కైవల్యమొసగు ఘననిధికి | మహానిధి జడులకు యాదవకులుడు ||

చ|| ఆద్యుడు అచలుడు మహాభూతమితడు | అభేద్యుడసాధ్యుడు భీకరుడు |
సద్యఃఫలదుడు సకల మునులకును | వేద్యుడితడెపో వేంకటవిభుడు ||


http://www.esnips.com/doc/757ba4da-180b-4329-9b90-46571d6b9dbe/TELISINA-TELIYUDU-NALINA-KAANTI




pa|| telisina teliyuDu teliyani vAralu | tolaguDu brahmAdule yeruguduru ||

ca|| varadu DaKiladEvatalaku vaMdyuDu | garuDu Dasurulaku kaMTakuDu |
paramAtmuDaMbuja Bava SivAdulaku | parula kella muvvurilO nokaDu ||

ca|| dEvuDu sanakAdi munulakunu para- | daivamaKila vEdamulakunu |
kaivalyamosagu Gananidhiki | mahAnidhi jaDulaku yAdavakuluDu ||

ca|| AdyuDu acaluDu mahABUtamitaDu | aBEdyuDasAdhyuDu BIkaruDu |
sadyaHPaladuDu sakala munulakunu | vEdyuDitaDepO vEMkaTaviBuDu |

02469,నానా భక్తులివి నరుల మార్గములు

నానా భక్తులివి నరుల మార్గములు
యే నెపాననైనా నాతడియ్య కొను భక్తి

హరికిగా వాదించు టది ఉన్మాద భక్తి
పరుల గొలువకుంటే పతివ్రతా భక్తి
అరసి యాత్మ గనుటదియే విజ్నాన భక్తి
అరమరచి చొక్కుటే ఆనంద భక్తి

అతి సాహసాల పూజ అది రాక్షస భక్తి
అతనిదాసుల సేవే అదియే తురీయ భక్తి
క్షితి నొకపని గోరి చేసుటే తామసభక్తి
అతడే గతెని వుండుటది వైరాగ్య భక్తి

అట్టె స్వతంత్రుడౌటే అది రాజసభక్తి
నెట్టన శరణనుటే నిర్మల భక్తి
గట్టిగా శ్రీ వేంకటేశు కైంకర్యమే సేసి
తట్టుముట్టు లేనిదే తగ నిజ భక్తి


Get this widget | Track details | eSnips Social DNA



nAnA bhaktulivi narula mArgamulu
yE nepAnanainA nAtaDiyya konu bhakti

harikigA vAdiMcu Tadi unmAda bhakti
parula goluvakuMTE pativratA bhakti
arasi yAtma ganuTadiyE vijnAna bhakti
aramaraci cokkuTE AnaMda bhakti

ati sAhasAla pUja adi rAkShasa bhakti
atanidAsula sEvE adiyE turIya bhakti
kShiti nokapani gOri cEsuTE tAmasabhakti
ataDE gateni vuMDuTadi vairAgya bhakti

aTTe svataMtruDauTE adi rAjasabhakti
neTTana SaraNanuTE nirmala bhakti
gaTTigA Sree vEMkaTESu kaiMkaryamE sEsi
taTTumuTTu lEnidE taga nija bhakti

Friday

01325,మాదృశానాం భవామయ దేహినాం

మాదృశానాం భవామయ దేహినాం
యీదృశం జ్నానమితి యే పి న వదంతి

వాచామ గోచరం వాంఛా సర్వత్ర
నీచ కృత్యైరేవ నిబిడీ కృతా
కేచిదేపి వా విష్ణుకీర్తనం ప్రీత్యా
సూచయంతో వా శ్రోతుం న సంతి

కుటిల దుర్భోధనం కూహక్ం సర్వత్ర
వితవిడంబన మేవ వేద్మ్యధీతం
పటువిమలమార్గసంభావనం పరసుసుఖం
ఘతయితుం కష్టకలికాలే న సంతి

దురితమిదమేవ జంతూనాం సర్వత్ర
విరసకృత్యైరేవ విశదీకృతం
పరమాత్మానం భవ్యవేంకటనామ-
గిరివరం భజయితుం కేవా న సంతి


Get this widget | Track details | eSnips Social DNA



mAdRuSAnAM bhavAmaya dEhinAM
yIdRuSaM jnAnamiti yE pi na vadaMti

vAcAma gOcaraM vAMCA sarvatra
neeca kRutyairEva nibiDI kRutA
kEcidEpi vA viShNukIrtanaM prItyA
sUcayaMtO vA SrOtuM na saMti

kuTila durbhOdhanaM kUhakM sarvatra
vitaviDaMbana mEva vEdmyadhItaM
paTuvimalamArgasaMbhAvanaM parasusuKaM
GatayituM kaShTakalikAlE na saMti

duritamidamEva jaMtUnAM sarvatra
virasakRutyairEva viSadIkRutaM
paramAtmAnaM bhavyavEMkaTanAma-
girivaraM bhajayituM kEvA na saMti