Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Saturday

25432 , kaTTarO kaluvaDAlu gakkana vAkiLLanu

కట్టరో కలువడాలు గక్కన వాకిళ్ళను
పట్టరో వులుపలు శోభనద్రవ్యములును

తిరుకొడి యెక్కెనదె దేవుని కల్యాణానకు
గరుడపటము పైడి కంబమందును
ధరపై బ్రహ్మాదిదేవతలెల్లాను వచ్చిరదె
వరుసతో వాయిద్యాలు వాయించరో

ముంచి హోమములు సేసి మునులు సంభ్రమమున
అంచెల గడియ కుడు కట్టె పెట్టిరి
పెంచముగ దెరవేసి పెండ్లిపీట వెట్టిరదె
మించ బేరంటాండ్లు నర్మిలి బాడరో

శ్రీ వేంకటేశ్వరుడు చేరి యలమేల్మంగయు
యీ వేళ దలబాలు ఇట్టె పోసిరి
బూవములు పొత్తునను భుజియించి రిప్పుడిట్టె
వేవేలకు గప్పురపువిడే లియ్యరో





kaTTarO kaluvaDAlu gakkana vAkiLLanu
paTTarO vulupalu SObhanadravyamulunu

tirukoDi yekkenade dEvuni kalyANAnaku
garuDapaTamu paiDi kaMbamaMdunu
dharapai brahmAdidEvatalellAnu vaccirade
varusatO vAyidyAlu vAyiMcarO

muMci hOmamulu sEsi munulu saMbhramamuna
aMcela gaDiya kuDu kaTTe peTTiri
peMcamuga deravEsi peMDlipITa veTTirade
miMca bEraMTAMDlu narmili bADarO

SrI vEMkaTESvaruDu cEri yalamElmaMgayu
yI vELa dalabAlu iTTe pOsiri
bUvamulu pottunanu bhujiyiMci rippuDiTTe
vEvElaku gappurapuviDE liyyarO

No comments: