నా తప్పు లో గొనవే నన్ను గావవే దేవ
చేత లిన్నీ జేసి నిన్ను జేరి శరణంటిని
అందరిలో నంతర్యామివై నీ వుండగాను
యిందరి బనులగొంటి నిన్నాళ్ళును
సందడించి యిన్నిటా నీ చైతన్యమే యుండగాను
వందులేక నే గొన్ని వాహనా లెక్కితిని
లోక పరిపూర్ణుడవై లోనా వెలి నుండగాను
చేకొని పూవులు బండ్లు జిదిమితిని
కైకొని యీ మాయలు నీ కల్పితమై వుండగాను
చౌక లేక నే వేరే సంకల్పించితిని
యెక్కడ చూచిన నీవే యేలికవై నుండగాను
యిక్కడా దొత్తుల బంట్ల నేలితి నేను
చక్కని శ్రీ వేంకటేశ సర్వాపరాధి నేను
మొక్కితి నన్ను రక్షించు ముందెఱగ నేను
http://www.esnips.com/doc/0ac71b18-0f21-42bc-8f88-d9bfc6d540df/NA-TAPPU-LO-GANAVE
nA tappu lO gonavE nannu gAvavE dEva
cEta linnI jEsi ninnu jEri SaraNaMTini
aMdarilO naMtaryAmivai nI vuMDagAnu
yiMdari banulagoMTi ninnALLunu
saMdaDiMci yinniTA nI caitanyamE yuMDagAnu
vaMdulEka nE gonni vAhanA lekkitini
lOka paripUrNuDavai lOnA veli nuMDagAnu
cEkoni pUvulu baMDlu jidimitini
kaikoni yI mAyalu nI kalpitamai vuMDagAnu
cauka lEka nE vErE saMkalpiMcitini
yekkaDa cUcina nIvE yElikavai nuMDagAnu
yikkaDA dottula baMTla nEliti nEnu
cakkani SrI vEMkaTESa sarvAparAdhi nEnu
mokkiti nannu rakShiMcu muMderxaga nEnu
No comments:
Post a Comment