Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Monday

01425,SrI vEMkaTESuDu SrI patiyu nitaDE pAvanapu

శ్రీ వేంకటేశుడు శ్రీ పతియు నితడే
పావనపు వైకుంఠపతియును నితడే

భాగవతములో జెప్పే బలరాముతీర్ధయాత్ర-
నాగమోక్తమైనదైవ మాతడీతడే
బాగుగా బ్రహ్మాండ పురాణపద్ధతియాత డితడే
యోగమై వామనపురాణోక్త దైవ మీతడే

వెలయ సప్తరుషులు వెదకి ప్రదక్షిణము-
లలర జేసిన దేవు డాత డీతడే
నెలవై కోనేటిపొంత నిత్యము గుమారస్వామి
కలిమి దపము సేసి కన్నదేవుడీతడే

యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు
తక్కక కొలిచియున్న తత్వ మీతడు
చక్క నారదాదుల సంకీర్తనకు జొక్కి
నిక్కిన శ్రీవేంకటాద్రినిలయుడు నీతడే
SrI vEMkaTESuDu SrI patiyu nitaDE
pAvanapu vaikuMThapatiyunu nitaDE

BAgavatamulO jeppE balarAmutIrdhayAtra-
nAgamOktamainadaiva mAtaDItaDE
bAgugA brahmAMDa purANapaddhatiyAta DitaDE
yOgamai vAmanapurANOkta daiva mItaDE

velaya saptaruShulu vedaki pradakShiNamu-
lalara jEsina dEvu DAta DItaDE
nelavai kOnETipoMta nityamu gumArasvAmi
kalimi dapamu sEsi kannadEvuDItaDE

yekkuvai brahmAdulu neppuDu niMdrAdulu
takkaka koliciyunna tatva mItaDu
cakka nAradAdula saMkIrtanaku jokki
nikkina SrIvEMkaTAdrinilayuDu nItaDE

No comments: