మనసు తన పాలింటి మమకారభూతమై
అనయంబు నిన్నిటికి నాధారమాయ
చూపు లాసల దగిలి సుఖయించ బోయినను
పైపైనె తలపులో పరితాపమాయ
తాపంబు బరవశము తనువు సొగసిన మఱియు
నాపదల కన్నిటికి నది మూలమయ
తలపులోపలిరతుల దమకించ బోయినను
తలపువలపుల కెల్ల దగులాట మాయ
వలపు లనియెడి మహావైభవము వొడగనిన
నలుపులును సొలపులిను నతిఘనము లాయ
కడు సొలసి శేషాద్రిఘనుని దూరిన యంత
అడరి యాతనికోప మగ్గలం బాయ
కడలేని కోపంబు కరుణారసముతో
దడసి యీపొందులకు దరవుకాడాయ.
http://www.esnips.com/doc/89d3d272-2c66-4e63-8f24-6b951aa2e034/MANASU-TANA
06155,Pdf Page 127
manasu tana pAliMTi mamakArabhUtamai
anayaMbu ninniTiki nAdhAramAya
cUpu lAsala dagili suKayiMca bOyinanu
paipaine talapulO paritApamAya
tApaMbu baravaSamu tanuvu sogasina marxiyu
nApadala kanniTiki nadi mUlamaya
talapulOpaliratula damakiMca bOyinanu
talapuvalapula kella dagulATa mAya
valapu laniyeDi mahAvaiBavamu voDaganina
nalupulunu solapulinu natighanamu lAya
kaDu solasi SEShAdrighanuni dUrina yaMta
aDari yAtanikOpa maggalaM bAya
kaDalEni kOpaMbu karuNArasamutO
daDasi yIpoMdulaku daravukADAya.
No comments:
Post a Comment