అలమేలుమంగ యీకె ఆనుక వద్దనుండది
చెలరేగి కందువలు చిత్తగించవయ్యా
తరుణి దేహమే నీకు తగు దివ్య రధము
గరుడధ్వజంబాపె కప్పుపయ్యద
తురగములు రతుల దోలెడు కోరికెలు
సరి నెక్కి వలపులు జయించవయ్యా
దిండు కల పిరుదులు తేరుబండికండ్లు
అండనే పువ్వులగుత్తు లాపెచన్నులు
కొండ వంటి శ్రుంగారము కోపు గల సొబగు
నిండుకొని దిక్కులెల్లా నీవే గెలువవయ్యా
వెలది కంఠము నీకు విజయశంఖమదిగో
నిలువెల్ల సాధనాలు నీకునాపె
యెలమి శ్రీ వేంకటేశ యిద్దరును గూడితిరి
పలుజయములు నిట్టే పరగవయ్యా
http://www.esnips.com/doc/e1ad1034-ce43-4527-a51a-2d13e2220567/ALAMELU-MANGAIDE
alamelu maMga yeke Anuka vaddanuMDadi
celarEgi kaMduvalu ciTTagiMcavayyA
taruni dEhamE neeku tagu divya radhamu
garudadhvajaMbApe kappu payyada
turagamulu ratulu dOledu korikalu
sari nekki valapulu jayiMchavayyA
diMdu kala pirudulu tErubaMdikaMdlu
aMDane puvvula guTT lApechannulu
koMda vaMti SrungAramu kOpu gala sobagu
niMDu koni dikkulellA neevE geluvavayyA
veladi kaMTHamu neeku vijayaSaMkha madigO
niluvella sAdhanAlu neeku nApe
yelami Sree vEmkaTesa yiddarunu gooditiri
palujayamulu niTTE paragavayyA
స్వామి వారి విజయ రహస్యాన్ని,వారి ఆయుధ సామగ్రి పటిమని,అన్నమయ్య ఈ సంకీర్తనలో వివరిస్తున్నాడు.
Meaning
http://www.esnips.com/doc/99fca85a-881d-4ecb-959e-dcc51d8a1d42/Alamelu-mamga-ide--meaning
మనసు నమ్మనేర్చితే మనుజుడే దేవుడౌను , తనలోనే వున్నవాడు తావుకొని దైవము-అన్నమయ్య-02352
Reality
‘వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao
If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.
No comments:
Post a Comment