ఏపాటివారికి నాపాటివాడవు
చేపట్టినవారిని చేకొని రక్షింతువు
విన్నపములు సేయువారి విన్నపములు విందువు
సన్నుతించే వారిని సారమెంతువు
కన్నుల జూచేవారి గడగి నీవు చూతువు
వున్నవారి కెల్లా నీవు వూరకే వుందువు
కొలచిన వారల కొలువు లీడేరింతువు
తలచిన వారల దండ నుందువు
వలసిన వారికి వరము లొసగుదువు
తెలియనివారల తెరువు నీ వొల్లవు
శరణు చొచ్చిన వారి సరవితో గాతువు
సరుగ నీ వారికి జన విత్తువు
యిరవై యలమేల్మంగ నేలిన శ్రీ వేంకటేశ
మడుగని వారికి మట్టుతో నుండుదవు
http://www.esnips.com/doc/e6665b59-7e47-4c11-8130-9ccb4f964a23/E-PAATI-VAARIKI
EpATivAriki nApATivADavu
cEpaTTinavArini cEkoni rakShiMtuvu
vinnapamulu sEyuvAri vinnapamulu viMduvu
sannutiMcE vArini sArameMtuvu
kannula jUcEvAri gaDagi nIvu cUtuvu
vunnavAri kellA nIvu vUrakE vuMduvu
kolacina vArala koluvu lIDEriMtuvu
talacina vArala daMDa nuMduvu
valasina vAriki varamu losaguduvu
teliyanivArala teruvu nI vollavu
SaraNu coccina vAri saravitO gAtuvu
saruga nI vAriki jana vittuvu
yiravai yalamElmaMga nElina SrI vEMkaTESa
maDugani vAriki maTTutO nuMDudavu
No comments:
Post a Comment