నీ వేమి సేతువయ్య నే వచ్చుటేదోసము
ఈ వేళ వెన్నెలగాసీ నిదియెపో దోసము
వలచినజవరాల వద్దనగ దోసము
కలిగినట్టాడుకున్న గడు దోసము
యెలమి నీ యంత నీ వెఱగవు దోసము
మలసి యింతసేసినమరునిదే దోసము
చెంగటిచెలులు బుద్దిచెప్పనిది దోసము
యింగితపుమతి రాయయినది దోసము
కంగించి రానీనియట్టి కాంతలదే దోసము
పొంగార దైవము దయవుట్టించని దోసము
తొట్టినసంపదలతో దొరవైన దోసము
వట్టినేరాలు నిన్నెంచెవారి దోసము
ఇట్టె శ్రీ వేంకటేశ యింతి గూడితివి నేడు
తట్టినట్టిందరికి నింతట బాసె దోసము
http://www.esnips.com/doc/9de2d278-3927-4fcf-86ab-91b652b0d922/NEEVEMI-SETUVAYYA
nI vEmi sEtuvayya nE vaccuTEdOsamu
I vELa vennelagAsI nidiyepO dOsamu
valacinajavarAla vaddanaga dOsamu
kaliginaTTADukunna gaDu dOsamu
yelami nI yaMta nI verxagavu dOsamu
malasi yiMtasEsinamarunidE dOsamu
ceMgaTicelulu buddiceppanidi dOsamu
yiMgitapumati rAyayinadi dOsamu
kaMgiMci rAnIniyaTTi kAMtaladE dOsamu
poMgAra daivamu dayavuTTiMcani dOsamu
toTTinasaMpadalatO doravaina dOsamu
vaTTinErAlu ninneMcevAri dOsamu
iTTe SrI vEMkaTESa yiMti gUDitivi nEDu
taTTinaTTiMdariki niMtaTa bAse dOsamu
No comments:
Post a Comment