నాటకమింతా నవ్వులకే |
పూటకు బూటకు బొల్లైపోవు ||
కోటి విద్యలును గూటి కొఱకే పో |
చాటున మెలగేటి శరీరికి |
తేటల నాకలి దీరిన పిమ్మట |
పాటుకు బాటే బయలైపోవు ||
మెఱసేటి దెల్లా మెలుతల కొరకే |
చెఱలదేహముల జీవునికి |
అఱమరపుల సుఖమందిన పిమ్మట |
మెఱుగుకు మెఱుగే మొయిలై పోవు |
అన్ని చదువులును నాతని కొరకే |
నన్నెరిగిన సుజ్ఞానికిని |
యిన్నిట శ్రీ వేంకటేశు దాసునికి |
వెన్నెల మాయలు విడివిడి పోవు |
http://www.esnips.com/doc/b3978b85-ab43-4045-a8fa-b171668a8a07/NATAKAMINTAA
nATakamiMtA navvulakE |
pUTaku bUTaku bollaipOvu ||
kOTi vidyalunu gUTi korxakE pO |
cATuna melagETi SarIriki |
tETala nAkali dIrina pimmaTa |
pATuku bATE bayalaipOvu ||
merasETi dellA melutala korakE |
cerxaladEhamula jIvuniki |
arxamarapula suKamaMdina pimmaTa |
merxuguku merxugE moyilai pOvu |
anni caduvulunu nAtani korakE |
nannerigina suj~jAnikini |
yinniTa SrI vEMkaTESu dAsuniki |
vennela mAyalu viDiviDi pOvu |
No comments:
Post a Comment