ప|| ప్రతిలేని పూజ దలపంగ కోటి మణుగులై |
అతివ పరవశము బ్రహ్మానందమాయె ||
చ|| మానినీమణి మనసు మంచి యాసనమాయె |
ఆనందబాష్ప జలమర్ఘ్యాదులాయె |
మీనాక్షి కనుదోయి మించు దీపములాయె |
ఆనన సుధారసంబు అభిషేకమాయె ||
చ|| మగువ చిరునగవులే మంచి క్రొవ్విరులాయె |
తగుమేని తావి చందనమలదుటాయె |
నిగనిగ నీతనుకాంతి నీరాజనంబాయె |
జగడంపుటలుకలు ఉపచారంబులాయె ||
చ|| ననుపైన పొందులె నైవేద్య తతులాయె |
తనివోని వేడుకలు తాంబూలమాయె |
వనిత శ్రీవేంకటేశ్వరుని కౌగిట జేయు |
వినయ వివరంబు లరవిరి మ్రొక్కులాయె ||
http://www.esnips.com/doc/58715da2-7461-4f24-889e-3471718052fd/PRATHILENI-POOJA
pa|| pratilEni pUja dalapaMga kOTi maNugulai |
ativa paravaSamu brahmAnaMdamAye ||
ca|| mAninImaNi manasu maMci yAsanamAye |
AnaMdabAShpa jalamarGyAdulAye |
mInAkShi kanudOyi miMcu dIpamulAye |
Anana sudhArasaMbu aBiShEkamAye ||
ca|| maguva cirunagavulE maMci krovvirulAye |
tagumEni tAvi caMdanamaladuTAye |
niganiga nItanukAMti nIrAjanaMbAye |
jagaDaMpuTalukalu upacAraMbulAye ||
ca|| nanupaina poMdule naivEdya tatulAye |
tanivOni vEDukalu tAMbUlamAye |
vanita SrIvEMkaTESvaruni kaugiTa jEyu |
vinaya vivaraMbu laraviri mrokkulAye ||
No comments:
Post a Comment