కోటి మన్మధాకార గోవింద కృష్ణ
పాటించి నీ మహిమలే పరబ్రహ్మ మాయ
ఆకాశమువంటిమేన నమరేమూర్తివి గాన
ఆకాశనదియె నీకు నభిషేకము
మేకొని నీవే నిండు మేఘవర్ణుడవు గాన
నీకు మేఘపుష్పాలే పన్నీరుకాపు
చంద్రుడు నీ మనసులో జనియించె నటుగాన
చంద్రికలు కప్రకాపై సరి నిండెను
యింద్రనీలపు గనులు యిలధరుడవు గాన
తంద్ర లేక యాపెచూపె తట్టుపుణుగాయను
లక్ష్మీపతివి గాన లాగులు నీ వురము పై
లక్ష్మీ యలమేలుమంగే లలి నీతాళి
సూక్ష్మమై శ్రీ వేంకటేశ చుక్కలపొడవు గాగ
పక్ష్మనక్షత్రములే యాభరణహారములు
http://www.esnips.com/doc/68d72e70-b9d3-49b4-875e-f7391370b26f/KOTI-MANMADAAKAARA
kOTi manmadhAkAra gOviMda kRuShNa
pATiMci nI mahimalE parabrahma mAya
AkASamuvaMTimEna namarEmUrtivi gAna
AkASanadiye nIku nabhiShEkamu
mEkoni nIvE niMDu mEghavarNuDavu gAna
nIku mEghapuShpAlE pannIrukApu
caMdruDu nI manasulO janiyiMce naTugAna
caMdrikalu kaprakApai sari niMDenu
yiMdranIlapu ganulu yiladharuDavu gAna
taMdra lEka yApecUpe taTTupuNugAyanu
lakShmIpativi gAna lAgulu nI vuramu pai
lakShmI yalamElumaMgE lali nItALi
sUkShmamai SrI vEMkaTESa cukkalapoDavu gAga
pakShmanakShatramulE yAbharaNahAramulu
No comments:
Post a Comment