Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Saturday

03516 sItA samEta rAma SrIrAma (Ramayana in A Sankitrana)

సీతా సమేత రామ శ్రీరామ - రాతి నాతి జేసిన శ్రీరామ రామ

ఆదిత్యకులమునందు నవతరించినరామ - కోదండభంజన రఘుకులరామ
ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ - వేదవేదంతములలో వెలసిన రామ

బలిమి సుగ్రీవుని పాలినిధానమ రామ - యిల మునులకభయమిచ్చిన రామ
జలధి నమ్ము మొనను సాధించిన రామ - అలరు రావణదర్పహరణ రామ

లాలించి విభీషణుని లంకనేలించిన రామ - చాలి శరణాగత రక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రి మీద వెలసిన రామ - తాలిమితో వెలయు ప్రతాపపు రామ

http://www.youtube.com/watch?v=40tlCRxUUiI


sItA samEta rAma SrIrAma - rAti nAti jEsina SrIrAma rAma

AdityakulamunaMdu navatariMchinarAma - kOdaMDabhaMjana raghukularAma
AdariMchi viSwAmitru yAgamugAchina rAma - vEdavEdaMtamulalO velasina rAma

balimi sugrIvuni pAlinidhAnama rAma - yila munulakabhayamichchina rAma
jaladhi nammu monanu sAdhiMchina rAma - alaru rAvaNadarpaharaNa rAma

lAliMchi vibhIShaNuni laMkanEliMchina rAma - chAli SaraNAgata rakshaka rAma
mElimi SrIvEMkaTAdri mIda velasina rAma - tAlimitO velayu pratApapu rAma

Wednesday

01170,ఈతడఖిలంబునకు నీశ్వరుడై ,ItaDaKilaMbunaku

ప|| ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల- | భూతములలోన దా బొదలువాడితడు ||

చ|| గోపాంగనలమెరుగు గుబ్బచన్నులమీద | చూపట్టుకమ్మ గస్తురిపూత యితడు | 
తాపసోత్తముల చింతాసౌధములలోన | దీపించు సుజ్ఞానదీప మితడు ||

చ|| జలధికన్యాపాంగ లలితేక్షణములతో | కలసి వెలుగుచున్న కజ్జలంబితడు |
జలజాసనుని వదనజలధి మధ్యమునందు | అలర వెలువడిన పరమామృతంబితడు ||

చ|| పరివోని సురతసంపదల నింపులచేత | వరవధూతతికి పరవశమైన యితడు | 
తిరువేంకటాచలాధిపుడు దానె యుండి | పరిపాలనముసేయు భారకుండితడు ||


https://archive.org/details/ANNAMACHARYA_452


pa|| ItaDaKilaMbunaku nISvaruDai sakala- | BUtamulalOna dA bodaluvADitaDu ||

ca|| gOpAMganalamerugu gubbacannulamIda | cUpaTTukamma gasturipUta yitaDu |
 tApasOttamula ciMtAsaudhamulalOna | dIpiMcu suj~jAnadIpa mitaDu ||

ca|| jaladhikanyApAMga lalitEkShaNamulatO | kalasi velugucunna kajjalaMbitaDu | 
jalajAsanuni vadanajaladhi madhyamunaMdu | alara veluvaDina paramAmRutaMbitaDu ||

ca|| parivOni suratasaMpadala niMpulacEta | varavadhUtatiki paravaSamaina yitaDu | tiruvEMkaTAcalAdhipuDu dAne yuMDi | paripAlanamusEyu BArakuMDitaDu ||


ఈతడఖిలంబునకు - ఏత దఖిలంబునకు = ఈ సమస్తమునకు
చింతా సౌధములలోన = ధ్యానమను భవనముల యందు
జలధికన్యాపాంగ లలితేక్షణములలో = సముద్రుని పుత్రిక యైన లక్ష్మీ దేవి యొక్క కడగంటి విలాసపు చూపులలో
కబ్జలంబు = కాటుక
జలజాసనుని వదన జలధి మధ్యము నందు = బ్రహ్మ ముఖము లనెడి సముద్రముయొక్క మధ్యలో
పరివోని = కొఱత వడని


Eta dakhilaMbunaku = ee samastamunaku
ciMtA soudhamulalOna = dhyAnamanu bhavanamula YaMdu
jaladhikanyApAMga lalitEkShaNamulalO = samudruni putrika yaina lakShmee dEvi yokka kaDagaMTi vilAsapu cUpulalO
kabjalaMbu = kATuka
jalajAsanuni vadana jaladhi madhyamu naMdu = brahma muKamu laneDi samudramuYokka madhyalO
parivOni = korxata vaDani