Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Saturday

03516 sItA samEta rAma SrIrAma (Ramayana in A Sankitrana)

సీతా సమేత రామ శ్రీరామ - రాతి నాతి జేసిన శ్రీరామ రామ

ఆదిత్యకులమునందు నవతరించినరామ - కోదండభంజన రఘుకులరామ
ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ - వేదవేదంతములలో వెలసిన రామ

బలిమి సుగ్రీవుని పాలినిధానమ రామ - యిల మునులకభయమిచ్చిన రామ
జలధి నమ్ము మొనను సాధించిన రామ - అలరు రావణదర్పహరణ రామ

లాలించి విభీషణుని లంకనేలించిన రామ - చాలి శరణాగత రక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రి మీద వెలసిన రామ - తాలిమితో వెలయు ప్రతాపపు రామ

http://www.youtube.com/watch?v=40tlCRxUUiI


sItA samEta rAma SrIrAma - rAti nAti jEsina SrIrAma rAma

AdityakulamunaMdu navatariMchinarAma - kOdaMDabhaMjana raghukularAma
AdariMchi viSwAmitru yAgamugAchina rAma - vEdavEdaMtamulalO velasina rAma

balimi sugrIvuni pAlinidhAnama rAma - yila munulakabhayamichchina rAma
jaladhi nammu monanu sAdhiMchina rAma - alaru rAvaNadarpaharaNa rAma

lAliMchi vibhIShaNuni laMkanEliMchina rAma - chAli SaraNAgata rakshaka rAma
mElimi SrIvEMkaTAdri mIda velasina rAma - tAlimitO velayu pratApapu rAma

No comments: