Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Wednesday

desi-suladi-telugu-annamacharya

 https://archive.org/details/desi-suladi-telugu-annamacharya

వలె వలెనని వలచితినట తన వలలకు లోఁగానటరే ఇఁక
వలమో చలమో నాకును పతితో జగడములా
నెలఁతలు దన కెందరు గలిగిన నేనే సతమని తెలియరె
పొలమెల్లాఁ దిరిగిన తేఁటికి పూఁబొదయే నెలవుగదే*॥పల్లవి॥
వాక్యం
ఆనఁగదరె వోచెలులాల అతినితోడుత నీమాటలె
వినయంబున నే నడవఁగ శ్రీవేంకటపతి కిది దగవా॥వలెవలె॥
రామక్రియ, మఠెం
అల్లనాఁ డొకతెతోడ నట్టె మాటలాడఁగాను
చల్లఁగా నేనే చూచి జంకించితినా
పల్లదమాడితినటె పైఁడివంటిమాటనైన
చిల్లరే మానఁడాయ శ్రీవేంకటేశ్వరుఁడు॥వలెవలె॥
వరాళి, రూపకం
తానాడినమాటలెల్లా దలచుమని
కోనేటియనికి నాగుబ్బలమీదటను
ఆనవెట్టరె॥వలెవలె॥
బౌళి, ఝంపె
వెగ్గళముగ సారెకు నిక వెంగెములాగడగజాలను
సిగ్గరితనమున గొసరెద శేషాచలపతిని॥వలెవలె॥
పాడి, తివుడ
అలిగి సాదించదగ దంజనాద్రీశ్వరుని
గలికిచూపులనె మది గరగజేసెదను॥వలెవలె॥
నాట, ఆటతాళం
చనవుగలిగిన సరసమమమరును సముకమున నే మనసు దెలిసెద
మునుప నడుగరె మదజనకుని ముద్దుటుంగము॥వలెవలె॥
శ్రీరాగం, ఏకతాళి
మాయింటికి నేడు రాగా మంకులూ బొంకులు దేరె
వేయినేల నే మొక్కెనే వేంకటరాయనికి
అలరివరతుల దొయ్యలులాల నన్ను
గలసె వేడుక శ్రీవేంకటవిభుడు॥వలెవలె॥


The love-lorn Nayika in her anguish outpours her varied feelings
to the Sakhis thus:
1. When I myself crave for His love
do not I get into his traps?
Neither I reap any fruits nor I have
any malice. Why quarrels with my beloved!
He may be having many mates
but, know, I am the everlasting.
For the bee that wanders about
all over the field, flower-bush is the only abode.

(PALLAVI)

O Friends ! Please convey to Him these very feelings.
When I am so modest in my behaviour, is this
just on Venkatapati’s part (to be so unkind)?

(VAKYAM)

Gently I have seen Him the other day
While conversing fondly with a maiden
did I threaten Him then?
Did I babble even a precious word?
Yet Lord Venkateswara does not stop His naughty tricks*
2. You swear by my breasts and tell
Konetiraya to recollect all His utterances
(Interlude: The Nayika in a mood of reconciliation
(contemplates thus:)
3. I cannot indulge in any more in excessive sarcasms.
With bashfulness I hanker after Seshachalapati.
4. It is not proper to win over Anjanadrisvara
by fretting and fuming,
I shall melt his heart with my charming glances alone.
5. If there is acquaintance amusement emerges.
I will read His mind in person.
Will you please ask for Madanajanaka’s pretty ring first?
6. When He Himself dropped into my house, all the
obstinacies and lies vanished
Why all this? I bow unto Venkataraya.
7. O maidens? Venkatavibhu made love with me
delightfully with blossoming desires.
(The Epilogue comes when the Nayika and Nayaka reunite)


 https://archive.org/details/desi-suladi-telugu-annamacharya

No comments: