కొమ్మలు చూడరే గోవిందుడు
కుమ్మరించీ ముద్దు గోవిందుడు
దిట్టబాలులతో దిరిగి వీధుల
గొట్టీ నుట్లు గోవిందుడు
పట్టిన కోలలు పైపై జాపుచు
కుట్టీ దూంట్లుగా గోవిందుడు
నిలువుగాశతో నిడిగూతలతో
కొలకొలమని గోవిందుడు
వలసినపాలు వారలువట్టుచు
కులికి నవ్వీ గోవిందుడు
బారలు చాపుచు బట్టగ నింతుల
గూరిమి గూడీ గోవిందుడు
చేరి జవ్వనులు శ్రీ వేంకటాద్రిపై
గోర జెనకీ గోవిందుడు
http://www.esnips.com/doc/00e060f0-fe91-4ad3-86f7-629f78c45de5/KOMMALU-CHOODARE
kommalu cUDarE gOviMduDu
kummariMcI muddu gOviMduDu
diTTabAlulatO dirigi vIdhula
goTTI nuTlu gOviMduDu
paTTina kOlalu paipai jApucu
kuTTI dUMTlugA gOviMduDu
niluvugASatO niDigUtalatO
kolakolamani gOviMduDu
valasinapAlu vAraluvaTTucu
kuliki navvI gOviMduDu
bAralu cApucu baTTaga niMtula
gUrimi gUDI gOviMduDu
cEri javvanulu SrI vEMkaTAdripai
gOra jenakI gOviMduDu
No comments:
Post a Comment