Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Thursday

12513,kommasiMgAramu livi koladi veTTaga rAvu

కొమ్మసింగారము లివి కొలది వెట్టగ రావు
పమ్మిన యీసొబగులు భావించరే చెలులు

చెలియ పెద్దతురుము చీకట్లు గాయగాను
యెలమి మోముకళలు యెండ గాయగా
బలిసి రాతిరాయు బగలు వెనకముందై
కలయ కొక్కట మించీ గంటిరటే చెలులు

పొందుగ నీకెచన్నులు పొడవులై పెరుగగా
నందమై నెన్నడుము బయలై వుండగా
ఇందునే కొండలు మిన్ను గిందుమీదై యొక్కచోనే
చెంది వున్న వివివో చూచితిరటే చెలులు

శ్రీ వేంకటేశువీపున జేతు లీకెవి గప్పగా
యీవల నీతనిచేతు లీకె గప్పగా
ఆవల గొమ్మలు దీగె ననలు గొనలు నల్లి
చేవ దేరీని తిలకించితిరటే చెలులు

http://www.esnips.com/doc/cb9fc0bc-082e-4757-b279-63830809eb63/KOMMA-SINGAARAMULIVI

kommasiMgAramu livi koladi veTTaga rAvu
pammina yIsobagulu BAviMcarE celulu

celiya peddaturumu cIkaTlu gAyagAnu
yelami mOmukaLalu yeMDa gAyagA
balisi rAtirAyu bagalu venakamuMdai
kalaya kokkaTa miMcI gaMTiraTE celulu

poMduga nIkecannulu poDavulai perugagA
naMdamai nennaDumu bayalai vuMDagA
iMdunE koMDalu minnu giMdumIdai yokkacOnE
ceMdi vunna vivivO cUcitiraTE celulu

SrI vEMkaTESuvIpuna jEtu lIkevi gappagA
yIvala nItanicEtu lIke gappagA
Avala gommalu dIge nanalu gonalu nalli
cEva dErIni tilakiMcitiraTE celulu

No comments: