కొమ్మలు పాదాలొత్తగా గోవిందుడు
యెమ్మెలకే పవళించె నిదివో గోవిందుడు
సరిగా గొల్లెతలతో సరసాలాడి యలసి
నిరతితో బవళించె నేడు గోవిందుడు
అరసి బృందావనాన ఆవుల గాచి వచ్చి
ఇరవుగ బవళించె నిదివో గోవిందుడు
కదిసి గోపాలులతో కచ్చకాయ లాడివచ్చి
గుదిగొని బవళించె గోవిందుడు
మొదల గోవర్ధనాద్రి మోపు మోచి వచ్చి నేదు
యెదుటనే పవళించె నిదివో గోవిందుడు
నించి శ్రీ వేంకటాద్రిని నిలిచిందు బవళించె
కొంచక తిరుపతిలో గోవిందుడు
అంచెల బదారువేల నలమి వారివరుస
లెంచుకొంటా బవళించె నిదివో గోవిందుడు
http://www.esnips.com/doc/0fe2cc5d-141f-429b-b813-e5aa22eb7f9f/KOMMALU-PAADALOTTAGA
kommalu pAdAlottagA gOviMduDu
yemmelakE pavaLiMce nidivO gOviMduDu
sarigA golletalatO sarasAlADi yalasi
niratitO bavaLiMce nEDu gOviMduDu
arasi bRuMdAvanAna Avula gAci vacci
iravuga bavaLiMce nidivO gOviMduDu
kadisi gOpAlulatO kaccakAya lADivacci
gudigoni bavaLiMce gOviMduDu
modala gOvardhanAdri mOpu mOci vacci nEdu
yeduTanE pavaLiMce nidivO gOviMduDu
niMci SrI vEMkaTAdrini niliciMdu bavaLiMce
koMcaka tirupatilO gOviMduDu
aMcela badAruvEla nalami vArivarusa
leMcukoMTA bavaLiMce nidivO gOviMduDu
No comments:
Post a Comment