కొమ్మకడకు విచ్చేసి కోరినవరమీరాదా
యెమ్మెల మానసతపమీకె చేసీని
వెన్నెలయెండలలోన విరహతాపాన జెలి
పన్ని మిక్కుటమైన తపము చేసీని
చెన్నుమీర బరచిన చిగురుగత్తులమీద
యెన్నరాని వుగ్రతపమిదె చేసీని
మొనసి చెమట దలమునుకల నీటిలోన
పనివడి నీకు దపము చేసీని
ఘనమైన నిట్టూరుపుగాలిలోన జెలించక
యెనలేనిఘోరతపమిదె చేసీని
బాయిటనె తనమేని పచ్చిజవ్వనవనాన
పాయక నీరతికి దపము చేసీని
నీయింట శ్రీ వెంకటేశ నిన్ను గూడెలమేల్మంగ
యీయెడ మోహనతపమిదె చేసీని
http://www.esnips.com/doc/cddbb4e6-9100-446f-99c0-8381f410f1e9/KOMMA-KADAKU
kommakaDaku viccEsi kOrinavaramIrAdA
yemmela mAnasatapamIke cEsIni
vennelayeMDalalOna virahatApAna jeli
panni mikkuTamaina tapamu cEsIni
cennumIra baracina cigurugattulamIda
yennarAni vugratapamide cEsIni
monasi cemaTa dalamunukala nITilOna
panivaDi nIku dapamu cEsIni
ghanamaina niTTUrupugAlilOna jeliMcaka
yenalEnighOratapamide cEsIni
bAyiTane tanamEni paccijavvanavanAna
pAyaka nIratiki dapamu cEsIni
nIyiMTa SrI veMkaTESa ninnu gUDelamElmaMga
yIyeDa mOhanatapamide cEsIni
No comments:
Post a Comment