Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Sunday

05025,valapAragiMcavamma vanita nI- yaluka

వలపారగించవమ్మ వనిత నీ-
యలుక చిత్తమునకాకలి వేసినది

అడియాసలనె పక్వమైన సోయగపు-
వెడయలుకల మంచి వేడి వేడి రుచులు
ఎడ సేసి తాలిమి నెడయించి పైపైనె
పొడమిన తమకంపు బోనము వెట్టినది

ఆమంచి మధురంపు అధరామృతముల
కీమారుదావులు చల్లు వెన్నెల బయటను
కోమలపుదరితీపు కోరిక గుమ్మరించి
భామకు పూబానుపు పళ్ళెము వెట్టినది

కన్నుల కాంక్షలనెడి కళవళము దేరె
సన్నపు నవ్వులనెడి చన వగ్గలించెను
అన్నువపు మరపు నీకంతనింత గలిగెనే
అన్నియును దిరు వెంకటేశుని మన్ననలు

http://www.esnips.com/doc/d5b14fdd-9dd5-4a9d-99b4-089909e31db8/VALAPU-AARAGINCHAVAMMA

valapAragiMcavamma vanita nI-
yaluka cittamunakAkali vEsinadi

aDiyAsalane pakvamaina sOyagapu-
veDayalukala maMci vEDi vEDi ruculu
eDa sEsi tAlimi neDayiMci paipaine
poDamina tamakaMpu bOnamu veTTinadi

AmaMci madhuraMpu adharAmRutamula
kImArudAvulu callu vennela bayaTanu
kOmalapudaritIpu kOrika gummariMci
BAmaku pUbAnupu paLLemu veTTinadi

kannula kAMkShalaneDi kaLavaLamu dEre
sannapu navvulaneDi cana vaggaliMcenu
annuvapu marapu nIkaMtaniMta galigenE
anniyunu diru veMkaTESuni mannanalu


చెలికత్తె నాయికను నాయకుడైన శ్రీ వేంకటేశ్వరునితో శృంగారానుభూతుని పొందుమని ఉద్భోధిస్తూందీ పదంలో.

ఇందులోని భావనాశక్తి అనన్య సామాన్యమే గాదు, అనుపమానం.

అందుకే ఇది అపురూపమని పేర్కొనడం

ఆ భావనా పటిమకు తగిన రీతిలో ప్రయోగాలు సైతం అపురూపంగా తమంత తామే వచ్చి పదంలో కుదిరిపోవడం గమనించగలం.

వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమునకాకలి వేసినది,మంచి వేడి వేడి రుచులు తమకంపు బోనము వెట్టినది, అన్నవి అపురూప ప్రయోగాలు.

వలపారగించడం, వలపు చిత్తానికి ఆకలి వేయడం,వేడి వేడి రుచులు, తమకంబు బోనము పెట్టడం, పూబానుపు పళ్ళెము పెట్టడం" అనే ప్రయోగాలు అన్నమాచార్యుల భావనా వైశిష్ట్యానికి,తదుచిత ప్రయోగ నైపుణ్యానికి చక్కటి ఉదాహరణలు.

ఇలాంటి అపురూప భావాలు, ప్రయోగాలు అన్నమాచార్యుల సాహిత్యమంతటా గోచరిస్తాయి.

No comments: