Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Sunday

26018, వాడల వాడల ,vaaDala vaaDala venTa

వాడల వాడల వెంట వసంతము
జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ

కలికి నవ్వులె నీకు కప్పుర వసంతము
వలచూపు కలువల వసంతము
కులికి మట్లాడినదె కుంకుమ వసంతము
చలమున చల్లె నీ పై జాజర జాజర జాజ


కామిని జంకెన నీకు కస్తూరి వసంతము
వాముల మోహపునీటి వసంతము
బూమెల సరసముల పుప్పొడి వసంతము
సామజ గురుడ నీపై జాజర జాజర జాజ

అంగన అధరమిచ్చె అమృత వసంతము
సంగడి శ్రీ వేంకటేశ సతి గూడితి
ముంగిటి రతి చెమట ముత్తేల వసంతము
సంగతాయెనిద్దరికి జాజర జాజర జాజ

http://cid-ebc2ab90be8df406.skydrive.live.com/self.aspx/.Public/vADala%20vADala.mp3




vADala vADala vemTa vasantamu
jADatO challEru neepai jAjara jAjara jAja

kaliki navvule neeku kappura vasantamu
valachUpu kaluvala vasantamu
kuliki maTlaaDinade kumkuma vasantamu
chalamuna challe nee pai jAjara jAjara jAja


kAmini jamkena neeku kastUri vasamtamu
vaamula mOhapuneeTi vasantamu
bUmela sarasamula puppoDi vasamtamu
saamaja guruDa neepai jAjara jAjara jAja

amgana adharamichche amRta vasamtamu
samgaDi SrI vEmkaTESa sati gUDiti
mungiTi rati chemaTa muttEla vasntamu
samgatAyeniddariki jAjara jAjara jAja

4 comments:

ram said...

Any one knows meaning for the song?

Unknown said...

Dear sir

it is a kolatam pata

deenini palkuriki somanathdu ANADA PADAM GA PER KONNADATA

anadam to chindulu vestu gumpulu gumpulu ga sree purushulu valayakaram ga thiruguthu pade kolatam paata idi

i think it has a dance and song ie music form combo
so it is therapeutic both mentally and physically

i am 66 sir but i will dance for this song though in private
and i start crying with ananda - it is therapeutic

PLEASE LISTEN TO THE RECENT RENDITION BY GARIMELLA BALA KRISHNA PRASAD GARU through youtube

though i am a telugu person my knowledge is inadequate in giving the meaning
sir listen and enjoy and dance if you like

regards

m n sarma

Unknown said...

i am MANTHA NAGESWARA SARMA

MY EMAIL ID mnsmhrm@gmail.com

i do not have a blog

i am a teacher

kovego73 said...

ప్రతి వాడలోను వసంతోత్సవాలు జరుగుతున్నాయి
దాగిఉన్న నిన్ను వెతికి పట్టుకుని రంగులు పులుముతున్నారు

ఆ రంగులు ఎలాంటివి అంటే విను

మా అలమేలుమంగ నవ్వులు ఎంత స్వచ్ఛమైనవి అంటే కరిగి ఏ మాత్రం మసి వదలని కర్పూరం అంత స్వచ్ఛమైన. ఆ నవ్వులతో నీకు కర్పూర వసంతోత్సవం జరిపించుచూన్నది

మా అలమేలు మంగ చూపులు కలువపూల వలే ఉంటాయి. వలపుతో కూడిన ఆ చూపులు కలువపూల వసంతోత్సవం చేస్తున్నాయి

నీతో మాట్లాడేటప్పుడు మా అలమేలు మంగ సిగ్గు పడుతూ చెంపలు ఎరుపు దక్కుతాయి. ఆ మాటల లోని కెంపు నీకు కుంకుమ వసంతోత్సవం జరుగుతుంది

మా అలమేలు మంగ అధరము నీకు అమృత వసంతోత్సవం తో సమానం
ఇలాగ నువ్వు మా అలమేలు మంగ తో కలసి ఉన్నావు
మీ ఇద్దరి మధ్య జరిగే రతి వలన పుట్టిన చెమట ముత్యాల లాగా వసంతోత్సవం జరుపుతుంది
మీ ఇద్దరి సంగతులు ఉత్సాహంగా చేసుకునే జాజర వసంతోత్సవాలు వేంకటేశ్వరా