Reality

‘వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Saturday

02232, paramAtmuDu sarva paripUrNuDu

పరమాత్ముడు సర్వ పరిపూర్ణుడు
సురలకు నరులకు చోటయియున్నాడు

కన్నుల గంటానే కడు మాటలాడుతానే
తన్ను గానివాని వలె దాగియున్నాడు
అన్నియు వింటానే అట్టె వాసనగొంటానే
వన్నెల నూనెకుంచము వలె నున్నాడు

తనువులు మోచియు తలపులు దెలిసియు
యెనసియునెనయక యిట్లున్నాడు
చెనకి మాయకు మాయై జీవునికి జీవమై
మొనసి పూసలదారమువలె నున్నాడు

వేవేలు విధములై విశ్వమెల్లా నొకటై
పూవులవాసనవలె బొంచియున్నాడు
భావించ నిరాకారమై పట్టితే సాకారమై
శ్రీ వేంకటాద్రిమీద శ్రీ పతై యున్నాడు


http://www.esnips.com/doc/9cbd0e13-59fa-4a1c-ab00-9eb67d818042/PARAMATMUDU


paramAtmuDu sarva paripUrNuDu
suralaku narulaku cOTayiyunnADu

kannula gaMTAnE kaDu mATalADutAnE
tannu gAnivAni vale dAgiyunnADu
anniyu viMTAnE aTTe vAsanagoMTAnE
vannela nUnekuMcamu vale nunnADu

tanuvulu mOciyu talapulu delisiyu
yenasiyunenayaka yiTlunnADu
cenaki mAyaku mAyai jIvuniki jIvamai
monasi pUsaladAramuvale nunnADu

vEvElu vidhamulai viSvamellA nokaTai
pUvulavAsanavale boMciyunnADu
bhAviMca nirAkAramai paTTitE sAkAramai
SrI vEMkaTAdrimIda SrI patai yunnADu

Friday

02225, iha parasAdhana mI talapu

http://www.esnips.com/doc/ffe56f5e-0e4e-4e9b-889c-8eac71f926a8/IHA-PARA-SAADHANAMEE-TALAPU


ఇహ పరసాధన మీ తలపు
సహజ జ్ఞ్నానికి సత మీ తలపు

సిరులు ముంగిటను జిగి దడబడగా
హరిని మఱవనిది యది దలపు
సరి గాంత లెదుట సందడి గొనగా
తిరమయి భ్రమయనిదే తలపు

వొడలి వయోమద ముప్పతిల్లినను
అడచి మెలంగుట యది దలపు
కడగుచు సుఖదు:ఖములు ముంచినను
జడియని నామస్మరణమే తలపు

మతి సంసారపు మాయ గప్పినను
అతికాంక్ష జొరని దది తలపు
గతియై శ్రీ వేంకటపతి గాచిన
సతతము నితనిశరణమే తలపు



iha parasAdhana mI talapu
sahaja j~jnAniki sata mI talapu

sirulu muMgiTanu jigi daDabaDagA
harini marxavanidi yadi dalapu
sari gAMta leduTa saMdaDi gonagA
tiramayi BramayanidE talapu

voDali vayOmada muppatillinanu
aDaci melaMguTa yadi dalapu
kaDagucu suKadu:Kamulu muMcinanu
jaDiyani nAmasmaraNamE talapu

mati saMsArapu mAya gappinanu
atikAMkSha jorani dadi talapu
gatiyai SrI vEMkaTapati gAcina
satatamu nitaniSaraNamE talapu

Wednesday

05232,velinuMDi lOnuMDi velitigAkuMDi

వెలినుండి లోనుండి వెలితిగాకుండి
వెలి లోను పలుమారు వెదకేవె గాలి

పండు వెన్నెలలకును బ్రాణమగు గాలి
నిండు గొలకులలోన నెలకొన్న గాలి
బొండుమల్లెల తావి బొడవైన గాలి
యెండమావుల బోలి తేలయ్య గాలి

కొమ్మావిచవికెలో గొలువుండు గాలి
తమ్మికుడుకుల దేనె దాగేటి గాలి
యిమ్మయిన చలువలకిరవైన గాలి
కుమ్మరింపుచు వేడి గురిసేవె గాలి

తిరువేంకటాద్రి పై దిరమైన గాలి
సురతాంతముల జనుల జొక్కించు గాలి
తొరలి పయ్యదలలో దూరేటి గాలి
విరహాతురులనింత వేచకువె గాలి


http://www.esnips.com/doc/3b42ee2a-937e-41c9-8084-35bcb10af0dd/VELINUNDI-LONINDI-VELITI-GAAKUNDI

velinuMDi lOnuMDi velitigAkuMDi
veli lOnu palumAru vedakEve gAli

paMDu vennelalakunu brANamagu gAli
niMDu golakulalOna nelakonna gAli
boMDumallela tAvi boDavaina gAli
yeMDamAvula bOli tElayya gAli

kommAvicavikelO goluvuMDu gAli
tammikuDukula dEne dAgETi gAli
yimmayina caluvalakiravaina gAli
kummariMpucu vEDi gurisEve gAli

tiruvEMkaTAdri pai diramaina gAli
suratAMtamula janula jokkiMcu gAli
torali payyadalalO dUrETi gAli
virahAturulaniMta vEcakuve gAli

Thursday

20463,merxugu jekkula

మెఱుగు జెక్కుల అలమేలు మంగా
తఱితోడిరతులను దైవారవమ్మా

చనవులు నీకిచ్చి చక్కని వదనమెత్తి
పెనగీ నాతడు నిన్ను బ్రేమ తోడను
కనువిచ్చి చూడవమ్మ కందువల నవ్వవమ్మ
మనసిచ్చి యాతనితో మాటలాడవమ్మా

పొందులు నీతో నెరపి పూచి నీపై జేయివేసి
చిందీ నీపై నతడు చిఱుజెమట
విందులమోవియ్యవమ్మ వేడుకలు చూపవమ్మ
అందుకొని ఆకుమడి చాతని కీవమ్మా

గక్కునను గాగిలించి కరుణ నీపై నించి
ఇక్కువ గూడె శ్రీ వేంకటేశుడు నిన్ను
వక్కణ లడుగవమ్మ వన్నెలెల్లా జూపవమ్మ
నిక్కుచు నురముమీద నిండుకొనవమ్మా


http://www.esnips.com/doc/d6573dc2-3ba0-456f-9909-69b115cdf390/Meruguchekkula


merxugu jekkula alamElu maMgA
tarxitODiratulanu daivAravammA

canavulu nIkicci cakkani vadanametti
penagI nAtaDu ninnu brEma tODanu
kanuvicci cUDavamma kaMduvala navvavamma
manasicci yAtanitO mATalADavammA

poMdulu nItO nerapi pUci nIpai jEyivEsi
ciMdI nIpai nataDu cirxujemaTa
viMdulamOviyyavamma vEDukalu cUpavamma
aMdukoni AkumaDi cAtani kIvammA

gakkunanu gAgiliMci karuNa nIpai niMci
ikkuva gUDe SrI vEMkaTESuDu ninnu
vakkaNa laDugavamma vannelellA jUpavamma
nikkucu nuramumIda niMDukonavammA

Tuesday

05266, iMti BuvanamOhiniyaina Palamu

ఇంతి భువనమోహినియైన ఫలము
కాంతుని దలచి వగల జిక్కెనిపుడు

మెలుతకన్నుల గండుమీలైన ఫలము
తొలకు రెప్పల నీరు దొరకె నేడు
లలనమై నవపుష్పలతయైన ఫలము
వలపు చెమట నీట వడి దోగె నిపుడు

మెఱుగారు నెరులు తుమ్మిదలైన ఫలము
నెఱి దమ్మిమోముపై నెలకొన్నవి
పఱచు జక్కవలు గుబ్బలైన ఫలము
తొఱలి తాపపురవితో గూడె నిపుడు

పలు వన్నెమోవి బింబమైన ఫలము
చిలుక వోట్లచేత జెలువొందెను
కలికి వేంకటపతి గలసిన ఫలము
సొలసినాడనె నిత్యసుఖమబ్బె నిపుడు

http://www.esnips.com/doc/72c972e2-a3f3-4584-957e-9c77fcc3735d/INTI-BHUVANAMOHINI-AINA


iMti BuvanamOhiniyaina Palamu
kAMtuni dalaci vagala jikkenipuDu

melutakannula gaMDumIlaina Palamu
tolaku reppala nIru dorake nEDu
lalanamai navapuShpalatayaina Palamu
valapu cemaTa nITa vaDi dOge nipuDu

merxugAru nerulu tummidalaina Palamu
nerxi dammimOmupai nelakonnavi
parxacu jakkavalu gubbalaina Palamu
torxali tApapuravitO gUDe nipuDu

palu vannemOvi biMbamaina Palamu
ciluka vOTlacEta jeluvoMdenu
kaliki vEMkaTapati galasina Palamu
solasinADane nityasuKamabbe nipuDu

03573,SrIpati yokaDE SaraNamu mAkunu

శ్రీపతి యొకడే శరణము మాకును
తేప యితడె మఱి తెరగేది

ఆసలు మిగులా నాతుమ నున్నవి
యీసులేని సుఖ మెక్కడిది
చేసినపాపము చేతుల నున్నది
మోసపోనిగతి ముందర నేది

కోపము గొందుల గుణముల నున్నది
యేపున నిజసుఖ మిక నేది
దీపనాగ్ని తో దిరిగెటి దేహము
పై పై విరతికి బట్టేది

పంచేంద్రియముల పాలిటబడు ఇది
యించుక నిలుకడ కెడ యేది
యెంచగ శ్రీ వేంకటేశ్వరు డొకడే
పంచినవిధులను పాలించుగాక

http://www.esnips.com/doc/bc96ca41-11f1-4d60-afe6-5b8464db7cd0/SRI-PATI-OKKADE


SrIpati yokaDE SaraNamu mAkunu
tEpa yitaDe marxi teragEdi

Asalu migulA nAtuma nunnavi
yIsulEni suKa mekkaDidi
cEsinapApamu cEtula nunnadi
mOsapOnigati muMdara nEdi

kOpamu goMdula guNamula nunnadi
yEpuna nijasuKa mika nEdi
dIpanAgni tO dirigeTi dEhamu
pai pai viratiki baTTEdi

paMcEMdriyamula pAliTabaDu idi
yiMcuka nilukaDa keDa yEdi
yeMcaga SrI vEMkaTESvaru DokaDE
paMcinavidhulanu pAliMcugAka

07198,SrIvEMkaTESvaruniki cheli yalamElumaMga

శ్రీవేంకటేశ్వరునికి చెలి యలమేలుమంగ
వోవరిగా నెలకొని వురముపై నున్నది

పొంచి మచ్చ మైననాటి పొలసుకంపులు వాయ
సంచుల బన్నీట మజ్జనమార్పరే
అంచె గూర్మవరహములైనట్టి సొగటుదీర
మించ గప్పురధూళి మెత్తరే మేనును

నరసింహపుగదరు నాటివామనపుజిడ్డు
పరశురామునిగబ్బు పచ్చివీడను
పరిమళము గట్టిన బంగారు గిన్నె దెచ్చి
పొరి దిరుమేను దట్టపునుగిట్టె నించరే

గొల్లముంజురాచజడ్డు కోరి బుద్ధుడైన సిగ్గు
చొల్లుగుఱ్ఱపు నూగురొచ్చులు మానునా
ఇల్లిదె శ్రీ వేంకటేశుడీరూపై తానున్నవాడు
యెల్లపూదండలు సొమ్ములెక్కించరే


http://www.esnips.com/doc/172fdaff-01db-4e32-b702-204b4d26b0b0/SRI-VENKATESWARUNIKI-CHELI-ALAMELU-MANGA


SrIvEMkaTESvaruniki cheli yalamElumaMga
vOvarigA nelakoni vuramupai nunnadi

poMci macca mainanATi polasukaMpulu vAya
saMcula bannITa majjanamArparE
aMce gUrmavarahamulainaTTi sogaTudIra
miMca gappuradhULi mettarE mEnunu

narasiMhapugadaru nATivAmanapujiDDu
paraSurAmunigabbu paccivIDanu
parimaLamu gaTTina baMgAru ginne decci
pori dirumEnu daTTapunugiTTe niMcarE

gollamuMjurAcajaDDu kOri buddhuDaina siggu
collugurxrxapu nUgurocculu mAnunA
illide SrI vEMkaTESuDIrUpai tAnunnavADu
yellapUdaMDalu sommulekkiMcarE

01227,అదెచూడు తిరువేంకటాద్రి,adecUDu tiruvEMkaTA

అదెచూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము
లందు వెలుగొందీ ప్రభమీరగాను

తగ నూటయిరువై యెనిమిదితిరుపతుల గల
స్థానికులును చక్రవర్తిపీఠకమలములును
అగణితంబైన దేశాంత్రులమఠంబులును
నధికమై చెలువొందగాను

మిగులనున్నతములగుమేడలును మాడుగులు
మితిలేనిదివ్యతపస్సులున్న గృహములును
వొగి నొరగు బెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు
దిగువ తిరుపతి గడవగాను

పొదలి యరయోజనముపొడవునను బొలుపొంది
పదినొండుయోజనంబులపరపునను బరగి
చెదర కేవంకచూచిన మహాభూజములు
సింహశార్దూలములును

కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును
గరుడగంధర్వయక్షులును విద్యాధరులు
విదితమై విహరించువిశ్రాంతదేశముల
వేడుకలు దైవారగాను

యెక్కువలకెక్కువై యెసగి వెలసినపెద్ద
యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీద
అకజంబైన పల్లవరాయనిమటము
అల్లయేట్ల పేడ గడవన్

చక్కనేగుచు నవ్వచరి గడచి హరి దలచి
మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచినమీద
నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు
అంతంత గానరాగాను

బుగులుకొనుపరిమళంబుల పూవుదోటలును
పొందైన నానావిధంబుల వనంబులును
నిగడి కిక్కిరిసి పండినమహావృక్షముల
నీడలను నిలిచి నిలిచి

గగనంబుదాకి శృంగార రసభరితమై
కనకమయమైన గోపురములను జెలువొంది
జగతీధరుని దివ్యసంపదలు గలనగరు
సరుగనను గానరాగాను

ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగుదురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగతోయములు సోకిన భవము
లంతంత వీడి పారగను


యీకడను గోనేట యతులు బాశుపతుల్ మును
లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో
యేకమై తిరువేంకటాద్రీశు డాదరిని
యేప్రొద్దు విహరించగాను

http://www.esnips.com/doc/61953a86-59a3-4e44-93bd-58ace6bce421/ADE-CHOODU-TIRU-VENKATAADRI


decUDu tiruvEMkaTAdri nAluguyugamu
laMdu velugoMdI praBamIragAnu

taga nUTayiruvai yenimiditirupatula gala
sthAnikulunu cakravartipIThakamalamulunu
agaNitaMbaina dESAMtrulamaThaMbulunu
nadhikamai celuvoMdagAnu

migulanunnatamulagumEDalunu mADugulu
mitilEnidivyatapassulunna gRuhamulunu
vogi noragu berumALLa vunikipaTTayi velayu
diguva tirupati gaDavagAnu

podali yarayOjanamupoDavunanu bolupoMdi
padinoMDuyOjanaMbulaparapunanu baragi
cedara kEvaMkacUcina mahABUjamulu
siMhaSArdUlamulunu

kadisi suravarulu kinnarulu kiMpuruShulunu
garuDagaMdharvayakShulunu vidyAdharulu
viditamai vihariMcuviSrAMtadESamula
vEDukalu daivAragAnu

yekkuvalakekkuvai yesagi velasinapedda
yekku DatiSayamugA nekkinaMtaTimIda
akajaMbaina pallavarAyanimaTamu
allayETla pEDa gaDavan

cakkanEgucu navvacari gaDaci hari dalaci
mrokkucunu mOkALLamuDugu gaDacinamIda
nakkaDakkaDa vEMkaTAdrISusaMpadalu
aMtaMta gAnarAgAnu

bugulukonuparimaLaMbula pUvudOTalunu
poMdaina nAnAvidhaMbula vanaMbulunu
nigaDi kikkirisi paMDinamahAvRukShamula
nIDalanu nilici nilici

gaganaMbudAki SRuMgAra rasaBaritamai
kanakamayamaina gOpuramulanu jeluvoMdi
jagatIdharuni divyasaMpadalu galanagaru
sarugananu gAnarAgAnu

prAkaTaMbaina pApavinASanamulOni
Baritamaguduritamulu pagili pArucunuMDa
AkASagaMgatOyamulu sOkina Bavamu
laMtaMta vIDi pAraganu

yIkaDanu gOnETa yatulu bASupatul munu
lenna naggalamaivunna vaiShNavulalO
yEkamai tiruvEMkaTAdrISu DAdarini
yEproddu vihariMcagAnu

08030,kaMTimi viMTimi nIkatalu nEDu

కంటిమి వింటిమి నీకతలు నేడు
నంటుననే ఆసలు సానల బట్టేవా

కన్నులనే సొలసేవు కాకలనే అలసేవు
కన్నెరో నీకాతనికి కలదా పొందు
నన్నునేల మొరగేవు నాకునేల దాచేవు
సన్నలనే వలపులు చవిగొనేవా

సెలవులనే నవ్వేవు చెక్కులు చెమరించేవు
మలసి మీ యిద్దరికి మాటలందెనా
చెలగి యేల బొంకేవు సిగ్గులేల పెంచేవు
వెలినుండే రతులెలా వెలసేసేవా

భావములనే చొక్కేవు పై పై బులకించేవు
శ్రీ వెంకటేశ్వరు మేలు చేకూడెనా
పూవువలె బొదిగేవు బుసకొట్టే వింతలోనె
యీవిధాన నేమిమ్ము యెనయించనేరనా


http://www.esnips.com/doc/9044c416-6979-4c06-a731-251089ba79fa/KANTIMI-VINTIMI

kaMTimi viMTimi nIkatalu nEDu
naMTunanE Asalu sAnala baTTEvA

kannulanE solasEvu kAkalanE alasEvu
kannerO nIkAtaniki kaladA poMdu
nannunEla moragEvu nAkunEla dAcEvu
sannalanE valapulu cavigonEvA

selavulanE navvEvu cekkulu cemariMcEvu
malasi mI yiddariki mATalaMdenA
celagi yEla boMkEvu siggulEla peMcEvu
velinuMDE ratulelA velasEsEvA

BAvamulanE cokkEvu pai pai bulakiMcEvu
SrI veMkaTESvaru mElu cEkUDenA
pUvuvale bodigEvu busakoTTE viMtalOne
yIvidhAna nEmimmu yenayiMcanEranA

05092, kuMdaNaMpumai golletA tAneMdunu

ప|| కుందనంపుమై గొల్లెత తా- | నెందును పుట్టని యేతరి జాతి ||

చ|| కప్పులు దేరేటి కస్తురిచంకల | కొప్పెర గుబ్బల గొల్లెత |
చప్పుడు మట్టెల చల్లలమ్మెడిని | అప్పని ముందట హస్తిని జాతి ||

చ|| దుంపవెంట్రుకల దొడ్డతురుముగల | గుంపెన నడపుల గొల్లెత |
జంపుల నటనల చల్లలమ్మెడిని | చెంపల చమటల చిత్రిణి జాతి ||

చ|| వీపున నఖముల వెడవెడ నాటిని | కోపపు చూపుల గొల్లెత |
చాపున కట్టిన చల్లలమ్మెడిని | చాపేటి ఎలుగున శంకిణి జాతి ||

చ|| గారవమున వేంకటపతి కౌగిట | కూరిమివాయని గొల్లెత |
సారెకు నతనితో చల్లలమ్మెడిని | భారపు టలపుల పద్మిని జాతి ||


http://www.esnips.com/doc/f6f46ba6-45fa-4395-b799-69545ceb48f3/KUNDANAMPU-MAI-GOLLITAA

pa|| kuMdanaMpumai golleta tA- | neMdunu puTTani yEtari jAti ||

ca|| kappulu dErETi kasturicaMkala | koppera gubbala golleta |
cappuDu maTTela callalammeDini | appani muMdaTa hastini jAti ||

ca|| duMpaveMTrukala doDDaturumugala | guMpena naDapula golleta |
jaMpula naTanala callalammeDini | ceMpala camaTala citriNi jAti ||

ca|| vIpuna naKamula veDaveDa nATini | kOpapu cUpula golleta |
cApuna kaTTina callalammeDini | cApETi eluguna SaMkiNi jAti ||

ca|| gAravamuna vEMkaTapati kaugiTa | kUrimivAyani golleta |
sAreku natanitO callalammeDini | BArapu Talapula padmini jAti ||