వెలుపల మఱవక లోపల లేదు వెలుపల గలిగిన లోపల మఱచు |
చలమున నిదియే ఘడియ ఘడియకును సాధించినసుఖ మటు దోచు ||
వెలుపల వెలిగే చూడగ లోపలి వెడచీకటి గాననియట్లు |
అలరి ప్రపంచజ్ఞానికి దనలో నాత్మజ్ఞానము గనరాదు |
పలుమరు చీకటి చూడగ జూడగ బయలే వెలుగై తోచినయట్లు |
అలయక తనలోచూపు చూచినను అంతరంగమున హరి గనును ||
జాగరమే కడు జేయగ జేయగ సతతము నిద్దుర రానట్లు |
చేగలనింద్రియములలో దిరిగినచిత్తవికారము లయపడదు |
యీగతి నిద్దుర వోగా బోగా నిలలో సుద్దులు యెఱగనియట్టు |
యోగపుటేకాంతంబును దనమన సొగి మరవగ మరవగ హరి గనును ||
దేహపుటాకాశపునిట్టూర్పులు బాహిరపుబయట నడగినయట్లు |
ఆహా జీవునిజననమరణములు అందే పొడముచు నందడగు |
వూహల శ్రీవేంకటపతివాయువు కొగి నాకాశము నొక్కసూత్రము |
ఆహా ప్రాణాపానవాయువులు ఆతుమనిలుపుటేహరి గనుట ||
http://www.esnips.com/doc/e0ab5308-152a-4184-acb5-fab2e4908da6/VELUPALA-MARUVAKA
velupala marxavaka lOpala lEdu velupala galigina lOpala marxacu |
calamuna nidiyE GaDiya GaDiyakunu sAdhiMcinasuKa maTu dOcu ||
velupala veligE cUDaga lOpali veDacIkaTi gAnaniyaTlu |
alari prapaMcaj~jAniki danalO nAtmaj~jAnamu ganarAdu |
palumaru cIkaTi cUDaga jUDaga bayalE velugai tOcinayaTlu |
alayaka tanalOcUpu cUcinanu aMtaraMgamuna hari ganunu ||
jAgaramE kaDu jEyaga jEyaga satatamu niddura rAnaTlu |
cEgalaniMdriyamulalO diriginacittavikAramu layapaDadu |
yIgati niddura vOgA bOgA nilalO suddulu yerxaganiyaTTu |
yOgapuTEkAMtaMbunu danamana sogi maravaga maravaga hari ganunu ||
dEhapuTAkASapuniTTUrpulu bAhirapubayaTa naDaginayaTlu |
AhA jIvunijananamaraNamulu aMdE poDamucu naMdaDagu |
vUhala SrIvEMkaTapativAyuvu kogi nAkASamu nokkasUtramu |
AhA prANApAnavAyuvulu AtumanilupuTEhari ganuTa ||