Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Sunday

01354,ekkaDa nunnA nItaDu

ఎక్కడ నున్నా నీతడు
దిక్కయి మాదెస దిరిగీ గాక

సరసుడు చతురుడు జగదేకగురుడు
పరమాత్ము డఖిలబంధువుడు
హరి లోకోత్తరు డతడే నామతి
సిరితో బాయక చెలగీ గాక

ఉన్నతోన్నతు డుజ్జ్వలు డధికుడు
పన్నగశయనుడు భవహరుడు
యిన్నిట గలిగిన యిందిరా రమణుడు
మన్ననతో మము మనిపీ గాక

మమతల నలమేల్మంగకు సంతత-
రమణుడు వేంకటరాయడు
జమళిసంపదల సరసవిభవముల
తమకంబున మము దనిపీ గాక

http://www.esnips.com/doc/25b9f2f3-b2d9-47a0-9049-abfb5b73e048/EKKADA-NUNNA--ITADU
ekkaDa nunnA nItaDu
dikkayi mAdesa dirigI gAka

sarasuDu caturuDu jagadEkaguruDu
paramAtmu DaKilabaMdhuvuDu
hari lOkOttaru DataDE nAmati
siritO bAyaka celagI gAka

unnatOnnatu Dujjvalu DadhikuDu
pannagaSayanuDu bhavaharuDu
yinniTa galigina yiMdirA ramaNuDu
mannanatO mamu manipI gAka

mamatala nalamElmaMgaku saMtata-
ramaNuDu vEMkaTarAyaDu
jamaLisaMpadala sarasavibhavamula
tamakaMbuna mamu danipI gAka

No comments: