Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Monday

02504,ఇతని ప్రసాదమె ఇన్నియును,itani prasAdamE

ఇతని ప్రసాదమే యిన్నియును
గతి యితనిదేకన కాదనరాదు

కాయములో నొక ఘనసంసారము
ప్రాయంబులతో బ్రబలీని
ఆయ మందుకును హరి దానేయై
దాయక పాయక తగిలున్నాడు

వొనరినకలలో నొక సంసారము
మనసుతోడనే మలసీని
ననిచి యందుకును నారాయణుడై
కొన మొదలై తా గురియైనాడు

వుడిబడి కోర్కుల నొక సంసారము
బడి బడి యాసల బరగీని
విడువక యిది శ్రీ వేంకటేశ్వరుడే
తొడిబడ గల్పించి ధ్రువమయినాడు


http://www.esnips.com/doc/7908820e-1d99-4426-a7c1-9d508d36b8c4/ITANI-PRASAADAME

itani prasAdamE yinniyunu
gati yitanidEkana kAdanarAdu

kAyamulO noka GanasaMsAramu
prAyaMbulatO brabalIni
Aya maMdukunu hari dAnEyai
dAyaka pAyaka tagilunnADu

vonarinakalalO noka saMsAramu
manasutODanE malasIni
nanici yaMdukunu nArAyaNuDai
kona modalai tA guriyainADu

vuDibaDi kOrkula noka saMsAramu
baDi baDi yAsala baragIni
viDuvaka yidi SrI vEMkaTESvaruDE
toDibaDa galpiMci dhruvamayinADu

No comments: