యేచి నీవు రక్షించేదే యెక్కుడుపుణ్య మింతే
పాటించి నీ భావము పట్టవశమా తలచి
మేటి నా మనసు నీకు మీదెత్తుటింతే
నూటికైన నీ నామము నుడుగగవశమా
మాటలు నీ నెలవుగా నుట్టుపెట్టు టింతే
వేవేలైన నీ కధలు వినగ నా తరమా
సోవగా వీనులు తావు చూపుట యింతే
దేవ నీసాకారము ద్రిష్టించనావశమా
పావనముగా నందులో బనిగొను టింతే
గట్టిగా నిన్ను బూజించ గమ్మటి నా వసమా
నెట్టన నా మేను నీకు నేమించు టింతే
పట్టపలమేల్మంగపతివి శ్రీ వేంకటేశ
జట్టిగొనుకొరకు నీ శరణను టింతే
|
nI cittamu nA BAgyamu nE neMtaTi vADanu
yEci nIvu rakShiMcEdE yekkuDupuNya miMtE
pATiMci nI BAvamu paTTavaSamA talaci
mETi nA manasu nIku mIdettuTiMtE
nUTikaina nI nAmamu nuDugagavaSamA
mATalu nI nelavugA nuTTupeTTu TiMtE
vEvElaina nI kadhalu vinaga nA taramA
sOvagA vInulu tAvu cUpuTa yiMtE
dEva nIsAkAramu driShTiMcanAvaSamA
pAvanamugA naMdulO banigonu TiMtE
gaTTigA ninnu bUjiMca gammaTi nA vasamA
neTTana nA mEnu nIku nEmiMcu TiMtE
paTTapalamElmaMgapativi SrI vEMkaTESa
jaTTigonukoraku nI SaraNanu TiMtE
No comments:
Post a Comment