సాకిరైనవాడ నింతే సర్వేశుడే దిక్కు
ప్రపంచమధీనము పాలుపడ్డ దేహమిది
ప్రపంచముతోడిపాటు పరగీని
యెపుడూ నీయాతుమ యీశ్వరాధీనము
అపుడాత డెట్టునిచె నట్టే అయ్యీని
కర్మాన కధీనము కలిములు లేములు
కర్మమెట్టు గల్పించె గలిగీని
అర్మిలి నాయాచార్యునధీనము మోక్షము
ధర్మ మతనికృపను తానే వచ్చీని
చిత్తమునకధీనము చిల్లరయింద్రియములు
చిత్తము చిక్కినప్పుడు చిక్కీనవి
హత్తి శ్రీ వేంకటేశుదాస్యమధీనము జన్మము
పొత్తుల నందుకు నది పూచినట్టయ్యీని
|
nA kEla vicAramu nA kEla yAcAramu
sAkirainavADa niMtE sarvESuDE dikku
prapaMcamadhInamu pAlupaDDa dEhamidi
prapaMcamutODipATu paragIni
yepuDU nIyAtuma yISvarAdhInamu
apuDAta DeTTunice naTTE ayyIni
karmAna kadhInamu kalimulu lEmulu
karmameTTu galpiMce galigIni
armili nAyAcAryunadhInamu mOkShamu
dharma matanikRupanu tAnE vaccIni
cittamunakadhInamu cillarayiMdriyamulu
cittamu cikkinappuDu cikkInavi
hatti SrI vEMkaTESudAsyamadhInamu janmamu
pottula naMduku nadi pUcinaTTayyIni
No comments:
Post a Comment