ఆకెవో నాప్రాణమోహనపురాణి
దాకొని వేవేలు కాంతలలోన నున్నది
ముదితకురుల నెల్లా ముత్యములు మాణికాలు
గుదిగుచ్చి కీలుగంటు గొన్నది
సదరపు పసిడివజ్రాల చనుకట్టుది
అదె పైడిపూవులపైయ్యద వల్లె వాటుది
గుదిగుచ్చి కీలుగంటు గొన్నది
సదరపు పసిడివజ్రాల చనుకట్టుది
అదె పైడిపూవులపైయ్యద వల్లె వాటుది
పచ్చలు దాచిన యట్టి పాదుకలు మెట్టినది
లచ్చన మొగపుల మొలనూళ్ళది
అచ్చపుటుంగరముల అందెలు బాయపట్టాలు
గచ్చుల ముంజేతుల కంకణసూడిగేలది
లచ్చన మొగపుల మొలనూళ్ళది
అచ్చపుటుంగరముల అందెలు బాయపట్టాలు
గచ్చుల ముంజేతుల కంకణసూడిగేలది
నానా భూషణముల నానా సింగారాల
పానిపట్టి నా దిక్కె తప్పక చూచేది
ఆనకపు శ్రీవేంకటాద్రిపతినైన నన్ను
తానె వచ్చి కూడి నాదగ్గరనె వున్నది
పానిపట్టి నా దిక్కె తప్పక చూచేది
ఆనకపు శ్రీవేంకటాద్రిపతినైన నన్ను
తానె వచ్చి కూడి నాదగ్గరనె వున్నది
aakevO naapraaNamOhanapuraaNi
daakoni vaevaelu kaaMtalalOna nunnadi
muditakurula nellaa mutyamulu maaNikaalu
gudiguchchi keelugaMTu gonnadi
sadarapu pasiDivajraala chanukaTTudi
ade paiDipoovulapaiyyada valle vaaTudi
pachchalu daachina yaTTi paadukalu meTTinadi
lachchana mogapula molanooLLadi
achchapuTuMgaramula aMdelu baayapaTTaalu
gachchula muMjaetula kaMkaNasooDigaeladi
naanaa bhooshaNamula naanaa siMgaaraala
paanipaTTi naa dikke tappaka choochaedi
aanakapu SreevaeMkaTaadripatinaina nannu
taane vachchi kooDi naadaggarane vunnadi
No comments:
Post a Comment