kAMta yEmI ne~ragadu gAni
ceMtala nIgati cepparE celulu
cittaju nammulu Sirasuna muDavaga
gettuketla dAkenO gAni
guttapu jekkula kuMkuma cemaTalu
jottula gArI jUDarE celulu
caluva mEnipai sarulahAramulu
celagi nAni molacenO kAni
pulakala molakala bodalina payirulu
velase nidivO bhAviMcare celulu
ghanuDagu SrI vEMkaTapati gUDaga
cenaki gu~rutu sEsenO kAni
venakamuMdaralu viMtala voDamenu
kanugonarE yidi gakkana jelulu
https://archive.org/details/KantaEmiEragaduGani
కాంత యేమీ నెఱగదు గాని
చెంతల నీగతి చెప్పరే చెలులు
చిత్తజు నమ్ములు శిరసున ముడవగ
గెత్తుకెత్ల దాకెనో గాని
గుత్తపు జెక్కుల కుంకుమ చెమటలు
జొత్తుల గారీ జూడరే చెలులు
చలువ మేనిపై సరులహారములు
చెలగి నాని మొలచెనో కాని
పులకల మొలకల బొదలిన పయిరులు
వెలసె నిదివో భావించరె చెలులు
ఘనుడగు శ్రీ వేంకటపతి గూడగ
చెనకి గుఱుతు సేసెనో కాని
వెనకముందరలు వింతల వొడమెను
కనుగొనరే యిది గక్కన జెలులు
No comments:
Post a Comment