శ్రీ తరుణీపతి నిత్య సేవే జన్మఫలము
దేహపుటింద్రియముల దేహమందే యణచుటే
దేహముతోనే తాను దేవుడౌట
సోహలను వెలి జూచేచూపు లోనుచూచుటే
ఆహా దేవతల దనందే తాగనుట
వెలి నిట్టూరుపు గాలి వెళ్ళకుండా నాగుటే
కులికి తపోధనము గూడ పేట్టుట
తలపు తనందే తగ లయము సేయుటే
లలి బాపబంధముల లయము సేయుట
వెనక సంసారమందు విషయమిముక్తుడౌటే
మునుపనే తా జీవన్ముక్తుడౌట
పనివి శ్రీ వేంకటేశుపదములు శరణంటే
అనువైన దివ్యపదమప్పుడే తానందుట
http://www.esnips.com/doc/8f818cc5-40db-4c68-8c82-5efc3d12de0e/YE-TAPAMULU
E tapamulu nEla yEdAnamulu nEla
SrI taruNIpati nitya sEvE janmaPalamu
dEhapuTiMdriyamula dEhamaMdE yaNacuTE
dEhamutOnE tAnu dEvuDauTa
sOhalanu veli jUcEcUpu lOnucUcuTE
AhA dEvatala danaMdE tAganuTa
veli niTTUrupu gAli veLLakuMDA nAguTE
kuliki tapOdhanamu gUDa pETTuTa
talapu tanaMdE taga layamu sEyuTE
lali bApabaMdhamula layamu sEyuTa
venaka saMsAramaMdu viShayamimuktuDauTE
munupanE tA jIvanmuktuDauTa
panivi SrI vEMkaTEshupadamulu SaraNaMTE
anuvaina divyapadamappuDE tAnaMduTa
No comments:
Post a Comment