మదనుని తండ్రికి మజ్జనవేళ
పొదిగొనీ సింగారపు భోగములెల్లాను
పడతుల నవ్వులెల్లా పైనంటుకొన్నట్టు
కడలేక పొగడొందె గప్పురకాపు
నిడివి గల్పవృవ్రుక్షము నిండా బూచినట్టు
కడు దెల్లనై యమరె గప్పురకాపు
సుదతుల చూపులు సొరిది పై గప్పినట్టు
పొదిగొని జొబ్బిలీని పుణుగుకాపు
అదన నల్లగలువలట్టె ముంచుకొన్నట్టు
పొదలె దిరుమేనను పుణుగుకాపు
అలమేలుమంగ వురమందుండి యనురాగము
కులికినట్టు పన్నీరు గుంకుమకాపు
యెలమి శ్రీ వేంకటేశు డిన్ని సొమ్ములు నించుక
కొలువెల్లా నిండుకొని కుంకుమకాపు
http://www.esnips.com/doc/f5c977c6-c1f7-48f6-a48e-cba0ea139dff/MADANUNI
madanuni taMDriki majjanavELa
podigonI siMgArapu bhOgamulellAnu
paDatula navvulellA painaMTukonnaTTu
kaDalEka pogaDoMde gappurakApu
niDivi galpavRuvrukShamu niMDA bUcinaTTu
kaDu dellanai yamare gappurakApu
sudatula cUpulu soridi pai gappinaTTu
podigoni jobbilIni puNugukApu
adana nallagaluvalaTTe muMcukonnaTTu
podale dirumEnanu puNugukApu
alamElumaMga vuramaMduMDi yanurAgamu
kulikinaTTu pannIru guMkumakApu
yelami SrI vEMkaTESu Dinni sommulu niMcuka
koluvellA niMDukoni kuMkumakApu
No comments:
Post a Comment