Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Wednesday

05017,ఇదిగాక సౌభాగ్య మిదిగాక ,IdigAka saubhAgya

ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవంబిక నొకటి కలదా


అతివ జన్మము సఫలమై పరమయోగివలె-
నితర మోహాపేక్ష లిన్నియును విడిచె
సతి కోరికలు మహాశాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసన వోలె నుండె


తరుణి హృదయము కృతార్థత బొంది విభుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయ మంది యింతలో
సరిలేక మనసు నిశ్చలభావమాయ


శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ -
భావంబు నిజముగా బట్టె జెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ

http://www.esnips.com/doc/e1b0273b-c827-45ac-90c1-e66c09756fd5/IdiGakaSoubhagya_BKP


http://www.esnips.com/doc/d7d51095-1f46-44d9-82ee-e1fbe77c161a/IDI-GAAKA-SAUBHAGHYA-MIDI


idigAka sauBAgya midigAka tapamu marxi
yidigAka vaiBavaMbika nokaTi kaladA


ativa janmamu saPalamai paramayOgivale-
nitara mOhApEkSha linniyunu viDice
sati kOrikalu mahASAMtamai yide cUDa
satata vij~jAna vAsana vOle nuMDe


taruNi hRudayamu kRutArthata boMdi viBumIdi
paravaSAnaMda saMpadaku niravAya
sarasijAnana manO jaya maMdi yiMtalO
sarilEka manasu niScalaBAvamAya


SrI vEMkaTESvaruni jiMtiMci paratattva -
BAvaMbu nijamugA baTTe jeliyAtma
dEvOttamuni kRupAdhInurAlai yipuDu
lAvaNyavatiki nullaMbu diramAya

______________________________________________________________________________
Three Different Explanation's are available for this song.


1.TTD Vol5 Pdf Page 30 which has given meaning based on Sankara bhagavatpada's Vivekachudamani.

2.Sri I.V.Sitapati Rao garu who interpreted through SrIyOgaVidya taMtra Quoting from Sankara's Astonishing SaundaryaLahari.

3.Meaning From SangeethaSudha.org

____________________________________________________________________________

ఆదౌ నిత్యానిత్య వస్తువివేకః పరిగణ్యతే


ఇహాముత్ర ఫల భోగ విరాగస్తదనంతరమ్


శమాదిషట్క సంపత్తి: ముముక్షుత్వమితి స్ఫుటమ్.-

Verse 19 of Viveka ChUdamani Of Sankara
The sAdhana chatushTaya is described by BhagavAn Shankara in VivEka ChUDAmaNI as follows;

The first discipline is the discrimination between the Real and unreal.

The next discipline is the detachment or dispassion from the enjoyments of the world here and after death (heaven).

The third discipline is the practice of the six behavior traits - shama, dama, uparati, samAdhAna, shradda and titIksha;

the fourth discipline is the intense desire for escape from this samsAra or realization of the divinity in her or him
________________________________________________________________________________
Meaning Copied from TTD Vol 5 Annamacharya Sankeertanalu  Pdf Page 30


ఇందు ముముక్షువగు యోగి ఉపమానముగా ,విప్రలంభావస్థ లో నున్న నాయిక ఉపమేయముగా స్వీకరింపబడిరి.యోగికిని,వియోగినియగు నాయికకు సమాన ధర్మము,సమాన ఫలము నిర్దేశింపభడినవి.

( శృంగారం సంభోగమని, విప్రలంభమని రెండు రకాలు.

సంభోగ శృంగారం: అలమేల్మంగ శ్రీ వేంకటేశ్వరుల దివ్య శృంగార వర్ణనలు
విప్రలంభము: జీవాత్మ పరమాత్మతో సాన్నిహిత్యం పొందడానికి పరితపించే విధానం నాయికా నాయికుల పరంగా వర్ణన

ఉపమానము: పోలిక,దేనితో పోల్చుచున్నామో అది (Ex:చంద్రుడు)
ఉపమేయము: దేనిని వర్ణించు చున్నామో అది(Ex: ముఖము) )
 
ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము
మఱి యిదిగాక వైభవం బిక నొకటి కలదా

లౌకికమైన భాగ్యముగాని,పారమార్ధికమైన తపము గాని,ఇహపరసంబంధియగు విభవము గాని ఇంతకంటె( తా నిరూపించు దానికంటె) వేరు లేదని పల్లవి తో నిరూఢి చేయుచున్నాడు.

అతివ జన్మము సఫలమై పరమయోగివలె
నితర మోహాపేక్ష లిన్నియును విడిచె
సతి కోరికలు మహాశాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసన వోలె నుండె

ప్రపంచ సర్వస్వమును వదిలిన యోగి పరమాత్మను నిరంతరము భావించినట్లు ఈ వియోగావస్థలో నాయికత్వము నతిదేశించుకొన్న భక్తుడు పరబ్రహ్మమగు వేంకటేశ్వరుని నాయకుడుగా తన సర్వస్వముగా భావించుటచే ఐహికాముష్మిక ప్రపంచ మోహము,తనకు తానుగా వీడిపోవుచున్నది అని ప్రధమ చరణ భావము.దీని వలన "ఇహాముత్ర ఫలభోగ విరాగ: "అను వేదాంత సోపానము సిద్ధమైనది.

ఇంత పరిపాకము కావలనంటే సంకల్ప వికల్పాత్మకమైన మనసు కదలిక లేక నిలువ వలె గదా!

అట్లు మనసు నిలుపవలె నంటే పూర్వజన్మ భక్తి -వాసనా బలము గాఢముగ నుండవలె గదా!
గాఢ విజ్ఞ్నాన వాసనాబలము-వలననే మనసు నిలిచి తపము కుదిరి యోగిభావ మేర్పడినదని భావము.
ఇది ఒక జన్మలోని సాధనకు కలుగు ఫలితము గాదు.

"బహూనాం జన్మనామన్తే జ్ఞ్నానవా~మాం ప్రపద్యతే"
అను గీతా వచనరీతిగా ఎన్నో జన్మల సాధనకు ఫలము.


భౌతిక శృంగారమునందు గూడ ఈ యేకాగ్రత చూపట్టవచ్చును.కాని దాని యానందము క్షణికము,ఫలము మానుషము.
ఈ యేకాగ్రత "విచిన్తయన్తీయ-మనన్య మానసా తపోనిధిం వేత్సి న మాముపస్థితమ్" అను శ్లోకమున (శాకుంతలములో) గుఱుతింపబడినది.
కాని అన్నమయ్య చెప్పిన పరమాత్మక విషయకమైన ఏకాగ్రతవలని ఆనందము అనంతము,ఫలితము దివ్యమని తేలుచున్నది.


తరుణి హృదయము కృతార్థత బొంది
విభుమీది పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయ మంది
యింతలో సరిలేక మనసు నిశ్చలభావమాయ

క్రమముగా రెండవ చరణమున మనోజయము,తన్మయీ భావము వర్ణింపబడినవి. దీనిచే " శమదమాది సాధన సంపత్తి:" అను వేదాంత సోపానము సిద్ధమైనది.
నిత్యానిత్యవస్తు వివేక:అను వేదాంత ప్రధమ సోపానము ఈ యేకాగ్రభావనకు ముందే బీజరూపముగ సిద్ధమైనట్లే.

శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ భావంబు
నిజముగా బట్టె జెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై
యిపుడు లావణ్యవతికి నుల్లంబు దిరమాయ

మూడవ చరణమున పరతత్వరూప ప్రాప్తికలిగి దేహి , పరమార్ధచరమసోపానము దాటి సాలోక్య సిద్ధి నందినట్లు అర్ధమగుచున్నది.
దీనితో "ముముక్షుత్వం" అను వేదాంతపు కడపటి మెట్టు ,దాని సిద్ధియు వర్ణింపబడినట్లైనది.
నిత్యానిత్యవస్తు వివేక: ,ఇహాముత్రఫలభోగ విరాగ:,శమదమాది సాధన సంపత్తి :,ముముక్షత్వం" అను నాలుగు స్తంభములపైననే గదా మోక్ష సామ్రాజ్య మంతయు నిలిచి యున్నది.

No comments: