Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Monday

04168,nalla balli cennuDu nA pAliTi vennuDu

నల్ల బల్లి చెన్నుడు నా పాలిటి వెన్నుడు
యెల్ల జీవులకు మరి యిన్నిటా బ్రసన్నుడు

కమలావరుడు శ్రీకరమదనగురుడు
సమరదానవకులసంహారుడు
విమలగుణాకరుడు విజయచక్రధరుడు
కమనియ్య భక్త జన కరుణాకరుడు

వేదాంతవేద్యుడు విశ్వహితాపాద్యుడు
ఆదియు నంత్యము లేని యనవద్యుడు
సాదితయోగి హృద్యుడు శమితోగ్రచైద్యుడు
సోదించి చూచితేను సురలకు నాద్యుడు

కామితఫలశక్తుడు ఘనమహిమయుక్తుడు
ఆముకొన్న లోకరక్షణసక్తుడు
నేమాన శ్రీ వేంకటాద్రి నిలిచి మమ్మేలినాడు
కోమలుడు వీడిగో గోపికాసనురక్తుడు
http://www.esnips.com/doc/83abcb0d-c0c3-4465-910b-f67dfeae4771/NALLA-BALLI-CHENNUDU

nalla balli cennuDu nA pAliTi vennuDu
yella jIvulaku mari yinniTA brasannuDu

kamalAvaruDu SrIkaramadanaguruDu
samaradAnavakulasaMhAruDu
vimalaguNAkaruDu vijayacakradharuDu
kamaniyya bhakta jana karuNAkaruDu

vEdAMtavEdyuDu viSvahitApAdyuDu
Adiyu naMtyamu lEni yanavadyuDu
sAditayOgi hRudyuDu SamitOgracaidyuDu
sOdiMci cUcitEnu suralaku nAdyuDu

kAmitaphalaSaktuDu ghanamahimayuktuDu
Amukonna lOkarakShaNasaktuDu
nEmAna SrI vEMkaTAdri nilici mammElinADu
kOmaluDu vIDigO gOpikAsanuraktuDu

1 comment:

oremuna said...

కమనియ్య --> కమనీయ ?

లోకరక్షణసక్తుడు --> లోకరక్షణాసక్తుడు