వంచిన పన్నీట బో వాడె నీ మోము
మంచున దామెరసొంపు మాయుగదవే
సంపెంగ నూనియనే మజ్జనము సేయగ బో
చెంపజారి తురుమెల్ల జెదరీ నేడు
గుంపులైన తుమ్మిదలు కొమ్మ నీయలకలివి
రంపపు గంపునకు వెరచుగదవే
జవ్వాది యెప్పుడు నీ నొసల మెత్తగానె పో
యెవ్వరు విలిచిన నోరెత్తవు నేడు
కొవ్విన చిలుకపలుకులు దీనిగాలికి
దవ్వుదవ్వులనె కడు దాగుగదవే
ఒక్కటై వేంకటవిభుడొత్తినరేఖల బో
చక్కని నీచనుగొంగు జారీ నేడు
జక్కవపులుగులివి చందురుడుదయమైన
వుక్కమీరి బెదరుచునుండు గదవే
http://www.esnips.com/doc/da2559df-ef1f-4d05-9bbf-e3e667cf9c31/VACINA
vaMcina pannITa bO vADe nI mOmu
maMcuna dAmerasoMpu mAyugadavE
saMpeMga nUniyanE majjanamu sEyaga bO
ceMpajAri turumella jedarI nEDu
guMpulaina tummidalu komma nIyalakalivi
raMpapu gaMpunaku veracugadavE
javvAdi yeppuDu nI nosala mettagAne pO
yevvaru vilicina nOrettavu nEDu
kovvina cilukapalukulu dInigAliki
davvudavvulane kaDu dAgugadavE
okkaTai vEMkaTaviBuDottinarEKala bO
cakkani nIcanugoMgu jArI nEDu
jakkavapulugulivi caMduruDudayamaina
vukkamIri bedarucunuMDu gadavE
No comments:
Post a Comment