ప|| ఎంత మన్నించితో యీ యింతినిదె నీవు | అంతకంతకు ప్రేమనలరీనిపుడు ||
చ|| పడతి నాట్యశ్రాంతి పవళించి తొల్లి నీ- | తొడలపై నీవు తల దువ్వగాను |
కడలేని యిటువంటి కళలు దలచే కదా | విడువని వియోగమున వేగీనిపుడు ||
చ|| ఒనర కుచభారమున నొరగి యీ మలగుపై- | నెనసి నీవాకు మడిచియ్యగాను |
వనిత నేడటువంటి వలపుదలచే కదా | ఘనమైన తాపమున కాగీనిపుడు ||
చ|| సిరులు నీ మోముపై చెక్కులొయ్యన చేర్చి | యరమోడ్చి కనురెప్పలలమి యలమి |
తిరువేంకటాచలాధిపుడ నినుగూడియే | పరవశానంద సంపద దేలెనిపుడు ||
http://www.esnips.com/doc/b1467d2d-4daf-4bfd-8027-6a9fc2fa3de6/eMta-manniMcitO-yI-yiMtinide-nIvu
pa|| eMta manniMcitO yI yiMtinide nIvu | aMtakaMtaku prEmanalarInipuDu ||
ca|| paDati nATyaSrAMti pavaLiMci tolli nI- | toDalapai nIvu tala duvvagAnu |
kaDalEni yiTuvaMTi kaLalu dalacE kadA | viDuvani viyOgamuna vEgInipuDu ||
ca|| onara kucaBAramuna noragi yI malagupai- | nenasi nIvAku maDiciyyagAnu |
vanita nEDaTuvaMTi valapudalacE kadA | Ganamaina tApamuna kAgInipuDu ||
ca|| sirulu nI mOmupai cekkuloyyana cErci | yaramODci kanureppalalami yalami |
tiruvEMkaTAcalAdhipuDa ninugUDiyE | paravaSAnaMda saMpada dElenipuDu ||
No comments:
Post a Comment