ఇదే పెండ్లి లగ్న వేళ యింతికి నీకు
సుదతి మోవి చిగుళ్ళు సోబన పత్రికలు
తొయ్యలి చూచినచూపు తుమ్మిద పేరంటాండ్లు
నెయ్యమున నవె నీకు నివాళ్ళు
పయ్యదలో చన్నులు పరగ పూజకుండలు
నియ్యడ గంత కవె నిమ్మపండ్లు
చెలియ నవ్విన నవ్వు జిగి నీకు దలబాలు
చెలగి బువ్వాన కవె చిలుపాలు
పలుకులసరసాలు బలుమంగళాష్టకాలు
మలసి యవె మదనమంత్రాలు
వనిత కాగిలి నీకు వాటపుబెండ్లిచవిక
దినము నదె దోమతెరమంచము
వినయపు రతులు శ్రీ వేంకటేశ యిద్దరికి
కనుగొన నవె మీకు కంకణదారాలు
http://www.archive.org/details/ANNAMACHARYA_926
idE peMDli lagna vELa yiMtiki neeku
sudati mOvi ciguLLu sObana patrikalu
toyyali cUcinacUpu tummida pEraMTAMDlu
neyyamuna nave neeku nivALLu
payyadalO cannulu paraga pUjakuMDalu
niyyaDa gaMta kave nimmapaMDlu
celiya navvina navvu jigi neeku dalabAlu
celagi buvvAna kave cilupAlu
palukulasarasAlu balumaMgaLAShTakAlu
malasi yave madanamaMtrAlu
vanita kAgili neeku vATapubeMDlicavika
dinamu nade dOmateramaMcamu
vinayapu ratulu Sree vEMkaTESa yiddariki
kanugona nave meeku kaMkaNadArAlu
మనసు నమ్మనేర్చితే మనుజుడే దేవుడౌను , తనలోనే వున్నవాడు తావుకొని దైవము-అన్నమయ్య-02352
Reality
‘వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao
If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.
No comments:
Post a Comment