|
సకల సందేహమై జరుగుచున్నది యొకటి
ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని
వసుదేవుజఠరమనువననిధికి జంద్రుడై
అసమానగతి బొడమినా డీతడు
వసుధ జంద్రుడు నీలవర్ణు డేటికినాయ
కసరెత్తి నునుగందు గలయగొనుబోలు
ఇనవంశమున లోకహితకల్పభూజమై
అనఘుడై జనియించినా డీతడు
ననుపై నసురతరువు నల్లనేటికినాయ
పెనుగొమ్మలో చేగ పెరిగిరాబోలు
తిరువేంకటాద్రిపై దెలియ జింతామణై
అరిదివలె బొడచూపినా డీతడు
గరిమె నది యిపుడు చీకటివర్ణమేలాయ
హరినీలమణులప్రభ లలమికొనబోలు
sakala saMdEhamai jarugucunnadi yokaTi
prakaTiMpa jIvamO brahmamO kAni
vasudEvujaTharamanuvananidhiki jaMdruDai
asamAnagati boDaminA DItaDu
vasudha jaMdruDu nIlavarNu DETikinAya
kasaretti nunugaMdu galayagonubOlu
inavaMSamuna lOkahitakalpabhUjamai
anaghuDai janiyiMcinA DItaDu
nanupai nasurataruvu nallanETikinAya
penugommalO cEga perigirAbOlu
tiruvEMkaTAdripai deliya jiMtAmaNai
aridivale boDacUpinA DItaDu
garime nadi yipuDu cIkaTivarNamElAya
harinIlamaNulaprabha lalamikonabOlu
No comments:
Post a Comment