|
అద్దో యెక్కడి సుద్ది అంతేసి కోపగలనా
గద్దించ నీతో నాకు బెద్దరికమా
చెలగి నీవేమి చేసినా జేసితివి గాక
చలములు సాదించ సరిదాననా
సెలవుల నవ్వేవు నీ చిత్తము కొలది గాక
మలసి నే మారునవ్వ మందెమేళమా
కొచ్చి కొచ్చి నీ వెంత కొంగువట్టి తీసినాను
పచ్చిదేర బెనగ కోపపుదాననా
యెచ్చరించి సారె సారె నిక్కువ లంటేవు నీవు
గచ్చుల నేనూ నొరయ గండ గర్వమా
యిక్కువ శ్రీవేంకటేశ యేలితివంటా నేను
నిక్కి యెమ్మె సేయ నీతో నీటుదాననా
మక్కువచేసి నన్ను మన్నించితివి రతుల
అక్కరతో గొసరగ ఆసోదమా
addO yekkaDi suddi amtEsi kOpagalanA
gaddiMca nItO nAku beddarikamA
celagi nIvEmi cEsinA jEsitivi gAka
calamulu sAdiMca saridAnanA
selavula navvEvu nI cittamu koladi gAka
malasi nE mArunavva maMdemELamA
kocci kocci nI veMta koMguvaTTi tIsinAnu
paccidEra benaga kOpapudAnanA
yeccariMci sAre sAre nikkuva laMTEvu nIvu
gaccula nEnU noraya gaMDa garvamA
yikkuva SrIvEMkaTESa yElitivaMTA nEnu
nikki yemme sEya nItO nITudAnanA
makkuvacEsi nannu manniMcitivi ratula
akkaratO gosaraga AsOdamA
No comments:
Post a Comment