Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Friday

15115,itani caMdamu hari hari Emi ceppa goladi

Get this widget | Track details | eSnips Social DNA


ఇతని చందము హరి హరి ఏమి చెప్ప గొలది హరి హరి
అతిరహస్యముల హరి హరి అదిగో మనకు జిక్కె హరి హరి

ఆదివిష్ణు డితడు హరి హరి అదె యశోదకొడుకు హరి హరి
వేదమూర్తి ఇతడె హరి హరి వెన్నదొంగిలించె హరి హరి
సాదుబండి విఱిచె హరి హరి చంటివిషము చెరిచె హరి హరి

పరమపురుషు డితడు హరి హరి పసుల గాచె నిదివో హరి హరి
సిరికి మగడు దాను హరి హరి చెలగి రోల దగిలె హరి హరి
పరగ జూడరోయి హరి హరి బదుకరోయి కొలిచి హరి హరి

అమరవంద్యు డితడు హరి హరి అణచె గంసుని హరి హరి
విమతదానవారి హరి హరి విరిచె మద్దులు హరి హరి
అమరె నిదివో హరి హరి శ్రీ వేంకటాద్రి మీద హరి హరి
జమళి రామకృష్ణుడు హరి హరి సర్వమితడు హరి హరి

itani caMdamu hari hari Emi ceppa goladi hari hari
atirahasyamula hari hari adigO manaku jikke hari hari

AdiviShNu DitaDu hari hari ade yaSOdakoDuku hari hari
vEdamUrti itaDe hari hari vennadoMgiliMce hari hari
sAdubaMDi vi~rice hari hari caMTiviShamu cerice hari hari

paramapuruShu DitaDu hari hari pasula gAce nidivO hari hari
siriki magaDu dAnu hari hari celagi rOla dagile hari hari
paraga jUDarOyi hari hari badukarOyi kolici hari hari

amaravaMdyu DitaDu hari hari aNace gaMsuni hari hari
vimatadAnavAri hari hari virice maddulu hari hari
amare nidivO hari hari SrI vEMkaTAdri mIda hari hari
jamaLi rAmakRShNuDu hari hari sarvamitaDu hari hari

No comments: