తలపోసి తలపోసి తమకించీ నా మనసు
చెలులాల ఆత డేమి సేసీనొకో
యెలయించినవాడు ఇంటికి రాడొకొ
చెలులు నంపితి మాట చేకొనెనొకొ
కలువల వేసినాడు కరుణించకుండునొకొ
సొలసి చూచినవాడు చుట్టమై చిక్కడొకొ
మచ్చిక చల్లినవాడు మంతనములాడడొకొ
ఇచ్చగించినాడు చనవియ్యడొకొ
కచ్చుపెట్టినవ్వేవాడు కప్పురవిడె మీడొకొ
వచ్చినవాడికను నావద్దనే వుండీనొకొ
వేడుక సేసినవాడు వీడు జోడై చొక్కడొకొ
వాడిక చూపినవాడు వసమౌనొకొ
యీడనె శ్రీ వేంకటేశు డిన్నిటాను నన్ను నేలె
కూడినవాడు నాబత్తి గొబ్బన మెచ్చునొకొ
http://www.esnips.com/doc/46fc458e-7288-4741-8856-70027cd5ebd6/TALAPOSI-TALAPOSI
talapOsi talapOsi tamakiMcee nA manasu
celulAla Ata DEmi sEseenokO
yelayiMcinavADu iMTiki rADoko
celulu naMpiti mATa cEkonenoko
kaluvala vEsinADu karuNiMcakuMDunoko
solasi cUcinavADu cuTTamai cikkaDoko
maccika callinavADu maMtanamulADaDoko
iccagiMcinADu canaviyyaDoko
kaccupeTTinavvEvADu kappuraviDe meeDoko
vaccinavADikanu nAvaddanE vuMDeenoko
vEDuka sEsinavADu veeDu jODai cokkaDoko
vADika cUpinavADu vasamaunoko
yeeDane Sree vEMkaTESu DinniTAnu nannu nEle
kUDinavADu nAbatti gobbana meccunoko
మనసు నమ్మనేర్చితే మనుజుడే దేవుడౌను , తనలోనే వున్నవాడు తావుకొని దైవము-అన్నమయ్య-02352
Reality
‘వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao
If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.
1 comment:
శేషాద్రి వాసుడు ఆన్నమయ్య శృంగార మంజరిని స్వీకరించుచు
జగతి నీ శృంగార సంకీర్తనముల
కగపడి మంచి ప్రాయపువాడనయితి
అన్నారట
-చిన్నన్న in అన్నమాచార్య చరిత్ర.
If anyone knows who the singer is please post.
Post a Comment