Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Tuesday

03508,Emani nutiMtu nEnu yiMdirAnAyaka nIvu

ఏమని నుతింతు నేను యిందిరానాయక నీవు
కామించి కోరినవారి కల్పలతవు

నెట్టన దలచే వారి నిండునిధానమవు
పట్టిన వారి చేతి బంగారమవు
చుట్టరిక మెంచేవారిచోటికి దల్లిదండ్రివి
ముట్టి కొలిచిన వారి ముంజీతమవు

సేవ చేసినవారికి చేతిలో మాణికమవు
భావించువారికి పరబ్రహ్మమవు
కావలెనన్న వారికి ఘనమనోరధమవు
వావిరి బూజించు వారి వజ్రపంజరమవు

బత్తిసేసిన వారికి భవరోగవైద్యుడవు
హత్తి నుతించినవారియానందమవు
పొత్తుల అలమేల్మంగ బువ్వపు శ్రీ వేంకటేశ
ఇత్తల మాపాలిటికి నిహపరదాతవు

http://www.esnips.com/doc/612121eb-3df7-404b-96e3-792328eaa4e4/YEMANI

Emani nutiMtu nEnu yiMdirAnAyaka nIvu
kAmiMci kOrinavAri kalpalatavu

neTTana dalacE vAri niMDunidhAnamavu
paTTina vAri cEti baMgAramavu
cuTTarika meMcEvAricOTiki dallidaMDrivi
muTTi kolicina vAri muMjItamavu

sEva cEsinavAriki cEtilO mANikamavu
bhAviMcuvAriki parabrahmamavu
kAvalenanna vAriki ghanamanOradhamavu
vAviri bUjiMcu vAri vajrapaMjaramavu

battisEsina vAriki bhavarOgavaidyuDavu
hatti nutiMcinavAriyAnaMdamavu
pottula alamElmaMga buvvapu SrI vEMkaTESa
ittala mApAliTiki nihaparadAtavu

No comments: