Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Wednesday

19411,rammanavE celuvuni ravva mammu jEyanEla

రమ్మనవే చెలువుని రవ్వ మమ్ము జేయనేల
తమ్మిపువ్వులవాట్లు దాకుదాకానా

గక్కన జూచినంతనే కన్నులనే పెండ్లాయ
వెక్కసపుతలబాలు వేగినంతనా
పక్కన నవ్వినంతనే పాలకూళ్ళ సెలవాయ
మక్కువతో బువ్వములు మాపుదాకునా

తొలుతటి సిగ్గులె దొడ్డ తెరమఱగాయ
వలిపెపుతెరమాటు వడి నింకానా
పొలపులమాటలనే సోబాన పాటలాయ
చలివాసె పేరటాండ్ల సంద డింకానా

పైనొరగి నప్పుడే పరవనిపరపాయ
నానబెట్టి నాగవల్లి నాటిదాకానా
ఆనుక శ్రీ వేంకటేశు డంతలోనె నన్నుగూడె
మేనిలోనిసంతసాలు మెచ్చుదాకానా

http://www.esnips.com/doc/b283f06d-9493-45b6-8a6c-683480b7a65c/Rammanavecheluvumee

rammanavE celuvuni ravva mammu jEyanEla
tammipuvvulavATlu dAkudAkAnA

gakkana jUcinaMtanE kannulanE peMDlAya
vekkasaputalabAlu vEginaMtanA
pakkana navvinaMtanE pAlakULLa selavAya
makkuvatO buvvamulu mApudAkunA

tolutaTi siggule doDDa teramarxagAya
valipeputeramATu vaDi niMkAnA
polapulamATalanE sObAna pATalAya
calivAse pEraTAMDla saMda DiMkAnA

painoragi nappuDE paravaniparapAya
nAnabeTTi nAgavalli nATidAkAnA
Anuka SrI vEMkaTESu DaMtalOne nannugUDe
mEnilOnisaMtasAlu meccudAkAnA

No comments: