Reality

వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’.‘భక్తి సాహిత్యంలో కవి చెప్పేది సగం మాత్రమే;మిగిలిన సగం పాఠకులు పూరిస్తారు, ఇది భక్తి సాహిత్యానికి ఉన్న ఒక స్పష్టమైన లక్షణం,’-V.N.Rao

If Sringara is the most poetically delineated emotive experience of Annamacharya, in Sri Rallapalli Anantakrishna Sarma's words " the great soul who has the rarest distinction of elevating it to lofty spiritual heights is Annamacharya".And that, indeed is the end of all conceits.

Monday

24092,javvana maMdari kokkasariyE kAdA

జవ్వన మందరి కొక్కసరియే కాదా
ఇవ్వల నింతేసి చేసి యేల యేచేవే

మదనుని యమ్మువాడి మగువ నీచూపువాడి
వెదచల్లువలపులు వేడివేడి
మది దమకము నిండె మాటలనే పొద్దువోయె
యిదివో యీగతి నన్ను యేల యేచేవే

చందురువెన్నెలజోలి సతి నీనవ్వుననాలి
సందడి గోరికలెల్ల జాలిమాలి
కందువ చిత్తము రాగె కాకలు మేనున మూగె
ఇందులోనే నీవు నన్ను యేల యేచేవే

వడి నమృతపుబావి వనిత నీమోవియీవి
జడియు గా గి టిపొందు జమళిఠీవి
కడ శ్రీ వేంకటపతి గనక కూడితి నేను-
నేడయ నింతటిమీద యేల యేచేవే



http://www.esnips.com/doc/dc0d14aa-a4a9-4501-8be7-00c70fab5956/javvanamaMdari--kokkasariyE-kAdA


javvana maMdari kokkasariyE kAdA
ivvala niMtEsi cEsi yEla yEcEvE


madanuni yammuvADi maguva nIcUpuvADi
vedacalluvalapulu vEDivEDi
madi damakamu niMDe mATalanE podduvOye
yidivO yIgati nannu yEla yEcEvE


caMduruvennelajOli sati nInavvunanAli
saMdaDi gOrikalella jAlimAli
kaMduva cittamu rAge kAkalu mEnuna mUge
iMdulOnE nIvu nannu yEla yEcEvE


vaDi namRutapubAvi vanita nImOviyIvi
jaDiyu gA gi TipoMdu jamaLiThIvi
kaDa SrI vEMkaTapati ganaka kUDiti nEnu-
nEDaya niMtaTimIda yEla yEcEvE

No comments: