పలుమారు బదియును బదియైన తలపు
సవతైనచదువులు సరుగ దెచ్చినతలపు
రవళి దరిగుబ్బలిని రంజిల్లుతలపు
కవగూడ గోరి భూకాంతముంగిటితలపు
తివిరి దూషకు గోళ్ళ దెగటార్చుతలపు
గొడుగువట్టిన వాని గోరి యడిగినతలపు
తడబడక విప్రులకు దానమిడుతలపు
వొడిసి జలనిధిని గడగూర్చితెచ్చినతలపు
జడియక హలాయుధము జళిపించుతలపు
వలపించి పురసతులవ్రతము చెరిచినతలపు
కలికితనములు చూపగలిగున్నతలపు
యిల వేంకటాద్రిపై నిరవుకొన్నతలపు
కలుషహరమై మోక్ష గతి చూపు తలపు
|
talapulOpali talapu daiva mitaDu
palumAru badiyunu badiyaina talapu
savatainacaduvulu saruga deccinatalapu
ravaLi darigubbalini raMjillutalapu
kavagUDa gOri BUkAMtamuMgiTitalapu
tiviri dUShaku gOLLa degaTArcutalapu
goDuguvaTTina vAni gOri yaDiginatalapu
taDabaDaka viprulaku dAnamiDutalapu
voDisi jalanidhini gaDagUrciteccinatalapu
jaDiyaka halAyudhamu jaLipiMcutalapu
valapiMci purasatulavratamu cericinatalapu
kalikitanamulu cUpagaligunnatalapu
yila vEMkaTAdripai niravukonnatalapu
kaluShaharamai mOksha gati cUpu talapu
No comments:
Post a Comment