ఈపెకు నితడు దగు నితని కీపె దగు
చూపులకు పండుగాయ శోభనము నేడు
పిలువరె పెండ్లికూతు బెండ్లిపీటమీదకి
చెలగి తా నెదురుచూచీ దేవుడు
బలువుగా నిద్దరికి బాసికములు గట్టరె
కలిమెల్ల మెరసి సింగారించరే
ఆతల దెచ్చి పెట్టరె ఆ పెండ్లి కూతురును
యీతడే జంట శోభన మిద్దరికిని
కాతరాన బువ్వానకు గక్కన బెట్టరె మీరు
రేతిటనుండియు వెగరించేరు వీరు
పానుపు వరచరె బలునాగవల్లి నేడు
పూని తెరవేయరె పొలతులాల
ఆనుక శ్రీ వేంకటేశు డలమేలు మంగయును
లోనునె భూకాంతయును లోలులైరి తాము
Ipeku nitaDu dagu nitani kIpe dagu
cUpulaku paMDugAya SObhanamu nEDu
piluvare peMDlikUtu beMDlipITamIdaki
celagi tA nedurucUcI dEvuDu
baluvugA niddariki bAsikamulu gaTTare
kalimella merasi siMgAriMcarE
Atala decci peTTare A peMDli kUturunu
yItaDE jaMTa SObhana middarikini
kAtarAna buvvAnaku gakkana beTTare mIru
rEtiTanuMDiyu vegariMcEru vIru
pAnupu varacare balunAgavalli nEDu
pUni teravEyare polatulAla
Anuka SrI vEMkaTESu DalamElu maMgayunu
lOnune BUkAMtayunu lOlulairi tAmu
No comments:
Post a Comment