ఈకెకు నీకు దగు నీడు జోడులు
వాకుచ్చి మిమ్ము బొగడవసమా యొరులకు
జట్టిగొన్న నీ దేవులు చంద్రముఖి గనక
అట్టె నిన్ను రామచంద్రుడనదగును
చుట్టమై కృష్ణవర్ణపుచూపులయాపెగనక
చుట్టుకొని నిన్ను కృష్ణుడవనదగును
చందమైనవామలోచన యాపెయౌగనక
అందరు నిన్ను వామను డనదగును
చెంది యాకె యప్పటిని సింహమధ్యగనక
అంది నిన్ను నరసింహుడని పిల్వదగును
చెలువమైనయాపె శ్రీదేవి యగుగనక
అల శ్రీ వక్షుడవని యాడదగును
అలమేల్మంగ యహిరోమాళి గలదిగన
యిల శేషాద్రి శ్రీ వేంకటేశు డనదగును
Ikeku nIku dagu nIDu jODulu
vAkucci mimmu bogaDavasamA yorulaku
jaTTigonna nI dEvulu caMdramukhi ganaka
aTTe ninnu rAmacaMdruDanadagunu
cuTTamai kRShNavarNapucUpulayApeganaka
cuTTukoni ninnu kRShNuDavanadagunu
caMdamainavAmalOcana yApeyauganaka
aMdaru ninnu vAmanu Danadagunu
ceMdi yAke yappaTini siMhamadhyaganaka
aMdi ninnu narasiMhuDani pilvadagunu
celuvamainayApe SrIdEvi yaguganaka
ala SrI vakShuDavani yADadagunu
alamElmaMga yahirOmALi galadigana
yila SEShAdri SrI vEMkaTESu Danadagunu
No comments:
Post a Comment