పతియే దైవము తనపతియే భాగ్యఫలము
వెతలేల చెలులాల విభుని దూరకురే
చిత్తమురా బతిమాట చేసితే వేడుక గాక
కత్తికోత గొసరితే కాంత యింపౌనా
హత్తి యిచ్చకురాలైతే నాతడే మన్నించు గాక
మొత్తాన దప్పు లెంచితే మోహము నిలుచునా
సమ్మతిగా బెనగితే సతి బాయకుండు గాక
రొమ్మున గుంపటియైతే రుచి వుట్టునా
నమ్మి ప్రియము చెప్పితే భావము గరగు గాక
యెమ్మెల విఱ్ఱవీగితే నెనయునా పొందులు
చాయపాటు చెవి నేల జనుగాక గుమ్మడి
కాయంత ముత్తెమైతే గట్టవచ్చునా
యీయెడ శ్రీ వేంకటేశుడే నలమేల్మాంగను
పాయక న న్నేలె గాక పరులెల్లా జుట్టాలా
patiyE daivamu tanapatiyE BAgyaphalamu
vetalEla celulAla vibhuni dUrakurE
cittamurA batimATa cEsitE vEDuka gAka
kattikOta gosaritE kAMta yiMpaunA
hatti yiccakurAlaitE nAtaDE manniMcu gAka
mottAna dappu leMcitE mOhamu nilucunA
sammatigA benagitE sati bAyakuMDu gAka
rommuna guMpaTiyaitE ruci vuTTunA
nammi priyamu ceppitE BAvamu garagu gAka
yemmela vi~r~ravIgitE nenayunA poMdulu
cAyapATu cevi nEla janugAka gummaDi
kAyaMta muttemaitE gaTTavaccunA
yIyeDa SrI vEMkaTESuDE nalamElmAMganu
pAyaka na nnEle gAka parulellA juTTAlA
No comments:
Post a Comment