నిక్కమటే యీ మాట నిజమనేవు
నిక్కముగాక బొంకనేర్తుమా బాలుడా
కంటివటే వెన్న దియ్యగా గొల్లెతా ని-
న్నంటిమా మా వెన్న వోయనంటిమి గాక
ఇంటికి నే వచ్చితినటే గొల్లెతా మా-
యింటికిక నీకు రానేలయ్య బాలుడా
ఎలే మాకు బాలు లెవటే గొల్లెతా నీకు-
నేలలేవు మమ్మునిట్టే యేచేవు గాక
పాల నేబండుట దలంపవే గొల్లెతా ఆ-
పాలు నీకునేల మా పాలేకాక బాలుడా
కల్లలాడ దొరకొంటిగా గొల్లెతా యేల
పల్లదాలు వేంకటాద్రి పై బాలుడా
చెల్లబో నన్నొల్లవటే చిన్ని గొల్లెతా నీకు
జెల్లునిట్టె యేమైన జేయవయ్య బాలుడా
http://ia310832.us.archive.org/0/items/ANNAMACHARYA_652/NikkamateEeMaataNijamanergsr.mp3
nikkamaTE yI mATa nijamanEvu
nikkamugAka boMkanErtumA bAluDA
kaMTivaTE venna diyyagA golletA ni-
nnaMTimA mA venna vOyanaMTimi gAka
iMTiki nE vaccitinaTE golletA mA-
yiMTikika nIku rAnElayya bAluDA
elE mAku bAlu levaTE golletA nIku-
nElalEvu mammuniTTE yEcEvu gAka
pAla nEbaMDuTa dalaMpavE golletA A-
pAlu nIkunEla mA pAlEkAka bAluDA
kallalADa dorakoMTigA golletA yEla
palladAlu vEMkaTAdri pai bAluDA
cellabO nannollavaTE cinni golletA nIku
jelluniTTe yEmaina jEyavayya bAluDA
No comments:
Post a Comment