నవ్వితినే గొల్లెతా నాయమవుర గొల్లడా
యెవ్వ రేమనిరే నిన్ను నియ్యకొంటి బదరా
కానీవే గొల్లెతా కద్దులేరా గొల్లడా
ఔనా మఱవకువే అట్టే కానీరా
నే నేమంటిని నిన్నునీకే తెలుసురా
మానితినే ఆమాటా మంచిదాయ బదరా
అదియేమే గొల్లెతా అందుకేరా గొల్లడా
కదిసె గడుపనులు కల్లగాదురా
ఇది నిక్కెమటవే ఇంతకంటె నటరా
పదరకువే నీవు పలుమారు నేలరా
మెచ్చితినే గొల్లెతా మేలు లేరా గొల్లడా
కుచ్చితి గాగిట నిన్నే గూడికొంటిరా
యిచ్చకుడ శ్రీ వేంకటేశుడను నేను
యెచ్చరించవలెనా యెఱుగుదు బదరా
http://www.esnips.com/doc/e0d404a2-2a0e-47d1-9ced-cbfb0828c018/navvitEnE-golletA
navvitinE golletA nAyamavura gollaDA
yevva rEmanirE ninnu niyyakoMTi badarA
kAnIvE golletA kaddulErA gollaDA
aunA ma~ravakuvE aTTE kAnIrA
nE nEmaMTini ninnu nIkE telusurA
mAnitinE AmATA maMcidAya badarA
adiyEmE golletA aMdukErA gollaDA
kadise gaDupanulu kallagAdurA
idi nikkemaTavE iMtakaMTe naTarA
padarakuvE nIvu palumAru nElarA
meccitinE golletA mElu lErA gollaDA
kucciti gAgiTa ninnE gUDikoMTirA
yiccakuDa SrI vEMkaTESuDanu nEnu
yeccariMcavalenA ye~rugudu badarA
No comments:
Post a Comment