cittamu lerigi sEvasEyarammA
pottulabuvvAnaku posagiMcarammA
pITamIda gUcuMDi peMDlADiriddarunu
cITikimATiki naTTe sigguvaDEru
mATalADiMci cUcitE maMtanamADukonEru
tETalugA niMtalOne teravEyarammA
cEtuloggiMcukoMTAnu sEsalu veTTukonEru
pOtarici selavula bUci navvEru
GhAtala nokarokari gaDakannula jUcEru
nIterigi paccaDamu niMDa gapparammA
kaDu dalaluvaMcuka kAgiTa niMcukonEru
aDari lOlOnE viDe maMdukonEru
yedayaka SrI vEMkaTESuDu iMtiyu gUDiri
baDibaDi dalupu gobbana mUyarammA
చిత్తము లెరిగి సేవసేయరమ్మా
పొత్తులబువ్వానకు పొసగించరమ్మా
పీటమీద గూచుండి పెండ్లాడిరిద్దరును
చీటికిమాటికి నట్టె సిగ్గువడేరు
మాటలాడించి చూచితే మంతనమాడుకొనేరు
తేటలుగా నింతలోనె తెరవేయరమ్మా
చేతులొగ్గించుకొంటాను సేసలు వెట్టుకొనేరు
పోతరిచి సెలవుల బూచి నవ్వేరు
ఘాతల నొకరొకరి గడకన్నుల జూచేరు
నీతెరిగి పచ్చడము నిండ గప్పరమ్మా
కడు దలలువంచుక కాగిట నించుకొనేరు
అడరి లోలోనే విడె మందుకొనేరు
యెదయక శ్రీ వేంకటేశుడు ఇంతియు గూడిరి
బడిబడి దలుపు గొబ్బన మూయరమ్మా
No comments:
Post a Comment