నిండు సోభనము నేడు నెయ్యపు దంపతులకు
మెండుగ నారతులెత్తి మీద సేసచల్లరే
కట్టుడు కలువడాలు ఘనమైన తోరణాలు
గట్టిగా బట్టణము సింగారించరే
కిట్టి రుక్మిణిదేవి గృష్ణుడు పెండ్లడి వచ్చె
పెట్టు డిందరికి నేడు పెండ్లి విడేలు
పాడరె సోబనాలు పైపైనె పేర(టాండ్లు
యీ డా డనక వీధు లేగించరే
జాడతో వాయించరే పంచ మహా వాయిద్యాలు
యీడనె పెండ్లికట్నా లియ్యరె యిద్దరికి
పొత్తుల విందులు దెచ్చి బువ్వమున నిడరే
హత్తి గంధాక్షత లీరే అందరు నేడు
నిత్తెమై శ్రీ వెంకటాద్రి నిలయు డీ కృష్ణుడు
తత్తరాన నీకె గూడె దగ్గరి సేవించరే
niMDu sOBhanamu nEDu neyyapu daMpatulaku
meMDuga nAratuletti mIda sEsacallarE
kaTTuDu kaluvaDAlu ghanamaina tOraNAlu
gaTTigA baTTaNamu siMgAriMcarE
kiTTi rukmiNidEvi gRShNuDu peMDlaDi vacce
peTTu DiMdariki nEDu peMDli viDElu
pADare sObanAlu paipaine pEra(TAMDlu
yI DA Danaka vIdhu lEgiMcarE
jADatO vAyiMcarE paMca mahA vAyidyAlu
yIDane peMDlikaTnA liyyare yiddariki
pottula viMdulu decci buvvamuna niDarE
hatti gaMdhAkShata lIrE aMdaru nEDu
nittemai SrI veMkaTAdri nilayu DI kRShNuDu
tattarAna nIke gUDe daggari sEviMcarE
No comments:
Post a Comment